కొన్ని సార్లు మన కళ్లు మనల్ని దారుణంగా మోసం చేస్తుంటాయి.   నిధులు, నిక్షేపాలు ఉన్నాయని గుడ్డిగా నమ్మి మంత్రాలు, పూజలు చేసి పాత వస్తువుల గురించి వెతుకుతారు..కొన్ని సార్లు లంకె బిందలు దొరికాయని, పాత కుండీలు దొరికాయని తెగ సంబరపడిపోతుంటారు..తీరా అవి ఓపెన్ చేస్తే మన్ను, పుర్రెలు, పాత ఇనుప సామాను ఉండటం చూసి ఖంగు తింటారు.  ఇలాంటి దేశంలో ఎన్నో సంఘటనలు జరిగాయి.  తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది..కాకపోతే అసలు విషయం తెలుసుకొని ఇంటిల్లిపాది వాంతులు చేసుకునే పరిస్థితి నెలకొంది.  వివరాల్లోకి వెళితే..గురుగ్రామ్ పరిధిలోని ఫజిల్ బద్ లీ అనే గ్రామంలో ఓ ఆసక్తికర ఘటన జరగింది. రజ్బీర్ అనే వ్యక్తి నిన్న ఉదయం తన గోధుమ పొలంలోకి వెళ్లాడు
Image result
సరిగ్గా అదే సమయంలో ఓ పెద్ద బండరాయిలాంటిది అతని పొలంలో పడింది. ఆ శబ్దం విని ఏంటా అని అక్కడి వెళ్లి చూడగా ఓ ఘన పదార్థం కనిపించి..పై నుంచి అది పడటంతో బహుషా అంతరిక్షం నుంచి పడ్డ అపురూ వస్తువు అనుకున్నాడు. ఆ వస్తువు తెల్లటి రంగులో చల్లగా ఉంది. కిందకు పడటంతో అది ముక్కలుగా విడిపోయింది.  సాధారణంగా గ్రహశకలాలు,  ఉల్కా శకలం ఆకాశం నుంచి పడుతుంటాయని తెలుసు..వాటి విలువ ఎంతో ఖరీదై ఉంటుందని భావిస్తుంటారు. 
Image result for airplane
అచ్చం ఇదే ఆలోచనలో రజ్బీర్ పడ్డారు..దీన్ని జాగ్రత్తగా తన ఇంట్లో దాచాలని చూశాడు. అతనితో పాటు మరికొందరు ఆ ముక్కలను జాగ్రత్తగా తీసుకొని ఫ్రిజ్జుల్లో..ఇతర ప్రదేశాల్లో దాచుకున్నారు.  ఈ విషయం కాస్త అధికారులకు తెలియడంతో హుటా హుటిన ఆ వస్తువును పరిశీలించడానికి వచ్చారు.  వాతావరణ శాఖ అధికారులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు గ్రామానికి చేరుకుని, ఆ పదార్థాన్ని పరీక్ష చేసి, అసలైన విషయాన్ని వెల్లడించారు.

ఈ విషయం తెలుసుకొని ఫ్రిజ్ లో దాచుకున్న వారికి మైండ్ బ్లాక్ అయ్యింది. దాంతో ఛీ..ఛీ..అంటూ వాంతులు చేసుకున్నారు.  అసలు విషయానికి వస్తే..ఆకాశం నుంచి పడింది బ్లూ ఐస్ అంటారు. విమానాల్లో మలమూత్రాలను ఘన రూపంలో భద్రపరుస్తారు. అప్పుడప్పుడు అవి విమానాల నుంచి లీకై కిందకు పడుతుంటాయి. కొన్నిసార్లు వాటిని నిర్దేశిత ప్రాంతాల్లో కూడా జారవిడుస్తుంటారు. విషయం తెలిసిన తర్వాత ఫ్రిజ్ లలో ఉన్న ఆ మలమూత్ర వ్యర్థాలను బయటపడేయటానికి వారు నానా తంటాలు పడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: