గత కొంత కాలంగా ప్రపంచంలో ఉగ్రదాడులు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా అఫ్ఘనిస్థాన్‌లో పరిసర ప్రాంతాల్లో ఈ దాడులు మరీ విపరీతం అయ్యాయి.  ఉగ్రవాదులు లక్ష్యం ఎలా ఉన్నా..అమాయక ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఎంతో మంది రోడ్డు పడుతున్నారు..అంగవైకల్యంతో అల్లాడి పోతున్నారు.   అఫ్ఘనిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం రాత్రి సాయుధులైన ఆగంతకులు నగరంలోని ఓ స్టార్‌ హోటల్‌లోకి ప్రవేశించి  కాల్పులకు తెగబడ్డారు.  
Image result for కాబూల్‌ ఉగ్రదాడి
ఓ వైపు అంతర్యుద్ధంపై చర్చలంటూ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రదాడికి పాల్పడ్డారు. గ్రెనేడ్‌ పేలుళ్లతో హౌటల్‌లో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.  సుమారు  రాత్రి 9 గంటల ప్రాంతంలో  హోటల్‌ వంట గది ద్వారా ప్రవేశించిన దుండగలు విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఆపై గ్రేనేడ్‌ దాడులు చేయటంతో మంటలు ఎగసిపడ్డాయి. ఘటన నుంచి తప్పించుకున్న హోటల్‌ మేనేజర్‌ అహ్మద్‌ హరిస్‌ నయబ్‌ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు.
Image result for kabul hotel
ఉగ్రవాదులు పెద్ద ఎత్తున హ్యాండ్‌ గ్రేనేడ్‌లతో హోటల్‌లోకి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.    విషయం తెలుసుకున్న భద్రతాబలగాలు రంగంలోకి దిగాయి.భారత కాలమానం ప్రకారం.. రాత్రి 1.15 నిమిషాల వరకు ఉగ్రవాదులు,భద్రతాబలగాలమధ్య ఎదురుకాల్పులు జరుగు తున్నాయి.  అఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌లో ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌పై దాడి చేసిన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి నజీబ్ డానిష్ చెప్పారు.
Image result for kabul hotel
ఆఫ్ఘనిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక విదేశీయుడు ఉన్నట్లు తెలిపారు. ఈ హోటల్‌లో బందీలుగా ఉన్న 153 మందిని నిర్బంధం నుంచి విముక్తి చేసినట్లు చెప్పారు.  కాగా 2011 జూన్‌ 28న ఇదే హౌటల్‌లో ఉగ్రవాదులు తెగబడ్డారు.ఈ దాడిలో 21 మంది చనిపోయారు.తాజాగా ఉగ్రదాడితో ఆఫ్ఘనిస్తాన్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: