చంద్ర బాబు నాయుడు కు లేక లేక ప్రధానమంత్రి అప్పాయింట్మెంట్ దొరికింది. ఆంధ్ర ప్రదేశ్ కి రావాల్సిన నిధులు, పోలవరం విషయం గురించి చర్చిస్తారని అందరు భావించారు. అయితే బాబు చర్చించిన విషయాలను ఇంత వరకు స్పష్టంగా చెప్పలేదు. అయితే  అదానీ గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా సంకల్పిస్తున్న భావనపాడు పోర్టును గంపగుత్తగా కట్టబెట్టేస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

Image result for chandrababu naidu and narendra modi

ప్రధాని నరేంద్రమోదీ  సుదీర్ఘ కాలం దూరం పెట్టిన చంద్రబాబునాయుడు ఇన్నాళ్ల తర్వాత అపాయింట్ మెంట్ ఇచ్చింది ఇందుకేనా అదానీకి కేటాయింపు జరగడం కోసమే మోదీ-చంద్రబాబు భేటీ సంభవించిందా అనే అనుమానాలు ఇప్పుడు పలువురిలో కలుగుతున్నాయి.  అయితే సహజంగానే ఈ కేటాయింపులపై కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Image result for chandrababu naidu and narendra modi

ప్రధానితో ఇన్నాళ్ల తర్వాత భేటీ అయిన చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఏం సాధించారో స్పష్టంగా  ఇప్పటిదాకా ఒక్క అంశం కూడా తేలలేదు గానీ ఆయన మోదీ కోసం ఏం చేయదలచుకున్నారో ఆ భేటీలో ఏం బేరం కుదుర్చుకున్నారో, ఈ అదానీ గ్రూపునకు కేటాయింపులతో స్పష్టంగానే కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అనేకం ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేవిగానే ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంవత్సరం ముంచుకు వచ్చేస్తున్నది గనుక  ఎక్కడికక్కడ పదుగురికీ లబ్ది చేకూరుస్తూ ఆ మేరకు ప్రత్యుపకారాలు పొందడానికి సర్కారులోని తెదేపా ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లుగా ఉన్నదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: