టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాన్ ఇప్పుడు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తన సత్తా చాటుతున్నారు.  తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత సార్వత్రిక ఎన్నికల వచ్చాయి.  అప్పటికే పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ ఏర్పాటు చేశారు. కానీ ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీకి సపోర్ట్ చేశారు.  అయితే జనసేన పార్టీ ఏర్పడి మూడు సంవత్సరాలు దాటింది..కాకపోతే ప్రజల తరుపు నుంచి పోరాడుతున్నారు.  పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అంతే కాదు గత కొంత కాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు.  ప్రస్తుతం జనసేన పార్టీ బలోపేతం చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. 

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్ర వివరాలను ప్రకటించారు. రేపట్నుంచి తెలంగాణలో యాత్ర ప్రారంభమవుతుంది. తొలుత నాలుగు రోజులపాటు తెలంగాణలోని మూడు జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ తెలిపారు. 2009లో జరిగిన ప్రమాదం నుంచి తనను ఆంజనేయస్వామే కాపాడాడని... అందువల్ల రేపు తొలుత కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని... అక్కడ నుంచి యాత్రను ప్రారంభిస్తానని చెప్పారు. 

పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీ సహా అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులతో పవన్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పవన్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాను చదువులో ఫెయిలయ్యాయని, ఒకవేళ బాగా చదువుకుని ఉంటే ప్రొఫెసర్ ని అయ్యేవాడినని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

ఇప్పటికే పలు పోలాండ్ చిత్రాలను దక్షిణ భారతదేశంలో చిత్రీకరించిన విషయాన్ని వారితో ప్రస్తావించారు. ఇందుకు, ఆడమ్ బురాకోవస్కీ స్పందిస్తూ, తమ దేశంలో కూడా ఇక్కడి సినిమాల షూటింగ్ లు జరుపుకోవాలని పవన్ ని కోరారు. ఈ సందర్భంగా రాజకీయాలపై పవన్ అభిప్రాయాన్ని ఆడమ్ బురాకోవస్కీ తెలుసుకున్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: