అజ్ఞాతవాసి సినిమా మీద భయంకరమైన సోషల్ మీడియా దాడి జరిగింది. అది వాస్తవం. సినిమా విడుదలయిన మరుక్షణం నుంచి విడియో క్లిప్ లు, ఫోటో షాప్ పిక్చర్లు, చిన్న చిన్న సెటైర్ రచనలు తెగ చలామణీ అయిపోయాయి. అటు ఫేస్ బుక్ లో, ఇటు వాట్సప్ లో. సినిమా బాగా లేదు. అది వాస్తవం. అలాంటపుడు మామూలు జనాలు అయితే సింపుల్ గా ఓ రెండు వాక్యాలు రాసి పోస్ట్ చేస్తారు. వాట్సప్ లోనో, ఫేస్ బుక్ లోనో. అంతే తప్ప, తమ సృజన అంతా వాడి, ఎప్పటివో పాత సినిమాల క్లిప్ లు తీసి, ఎడిట్ చేసి, జన రంజకంగా తయారు చేసి, అటు ఇటు తెగ సర్క్యులేట్ చేయరు.

Image result for pavan kalyan

సోషల్ మీడియా వ్యవహారాల్లోఆరితేరిన వారే చేయగలరు. అలాంటి సాధన సంపత్తి తెలుగుదేశం పార్టీకి వున్నంతగా మరే పార్టీకి లేదు. అది నూటికి నూరు పాళ్లు అంగీకరించాల్సిన విషయం. ఎంత తెలుగుదేశం పార్టీకి మద్దతు దారుగా వున్నా పవన్ ను కమ్మ సామాజిక వర్గం ఆమోదించదన్నది అందరికీ తెలిసిన విషయమే. పవన్ మరీ ఎదిగిపోతే తమ అభిమాన పార్టీకి కష్టమే అన్నది ఆ వర్గానికి తెలిసిన విషయమే. తెలుగునాట టీవీ 9,ఎబిఎన్ చానెళ్లు ఎవరి మద్దుతు దారులు అని కామన్ ఓటర్ ను ఎవరిని అడిగినా ఇట్టే సమాధానం వస్తుంది. ఆ రెండు చానెళ్లు తెలుగుదేశం మద్దతుగా వుంటాయని.

Image result for pavan kalyan

ఇక మహా టీవీ ఎవరిది? సాక్షాత్తూ తెలుగుదేశం ప్రముఖుడు సుజనా చౌదరిది. ఇటీవలే దానిని తెలుగుదేశం నేతలు కొందరు కలిసి టేకోవర్ చేసారని వార్తలు వున్నాయి. మరి ఇప్పుడు జనసేనపై కానీ, పవన్ పై కానీ దాడి చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కత్తిమహేష్ కు అండగా నిలిచింది ఈ చానెళ్లే కదా? జనసేన వీక్ అయితే వైకాపాకు మంచి జరుగుతుందని తెలిసీ ఇలా ఎందుకు చేసినట్లు? కేవలం టీఆర్పీల కోసం అయితే కాదు. పోనీ కత్తి మహేష్ కు భయంకరమైన అన్యాయం జరిగింది. అందుకే అండగా నిలిచాయి అనుకోవడానికీ లేదు. నిజంగా పవన్ ఒంటరి పోరు ప్రారంభిస్తే, తెలుగుదేశం పార్టీ ఈ చానెళ్లలో వినిపించిన ఆరోపణలు, విడియో క్లిప్ లు బయటకు తీస్తుంది. ఇవన్నీ చూస్తుంటే తెర వెనుక తెలుగు దేశం పార్టీ చాలా కథ నడిపిందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: