ఆమ్రపాలి.. తెలుగు న్యూస్ ఫాలో అయ్యేవారికి ఈ పేరు చాలా సుపరిచితమే.. డేరింగ్, డ్యాషింగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. బంగారానికి తావి అబ్బినట్టు.. ప్రతిభకు అందం కూడా తోడయ్యేసరికి ఆమెకు మీడియాలో చాలా పాపులారిటీ వచ్చేసింది. దీనికి తగ్గట్టు ఆమె తీసుకున్న నిర్ణయాలు.. పాలనలో తనదైన ముద్రవేయడంతో చాలా తక్కువ కాలంలోనే ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 

ఆమ్రపాలి కోసం చిత్ర ఫలితం
పాలనలో వైవిధ్యంతో పాటు కొన్ని కాంట్రావర్సీలు కూడా ఆమెను మరింత వార్తల్లోకి తీసుకొచ్చాయి. వరంగల్ జిల్లా కలెక్టర్‌గా ప్రజలతో మమేకం అవుతూ అతి తక్కువ కాలంలోనే ఆమ్రపాలి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. కలెక్టర్‌ హోదాలో ఆమె తీసుకునే నిర్ణయాలతో అడవుల్లో షికార్లు చేయడం, రాక్ క్లైంబింగ్ చేయడం ఇలా.. ఆమె ఏం చేసినా మీడియా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. 

ఆమ్రపాలి కోసం చిత్ర ఫలితం
అలాంటి అందాల కలెక్టరమ్మ ఇప్పుడు పెళ్లిపీటలెక్కబోతోంది. 2011 బ్యాచ్‌కు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారిని ఆమ్రపాలి వివాహం చేసుకోబోతున్నారన్నవార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆయన ఎస్పీగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ముహూర్తం కూడా ఎంతో దూరంలో లేదండోయ్.. వచ్చే ఫిబ్రవరి 18న వీరి వివాహం పెద్దల సమక్షంలో జరగనుందట. పెళ్లి పనులంటే అంత ఈజీ కాదు కదా.. అందుకే ఈ నెల 27 నుంచి ఆమ్రపాలి సెలవులో వెళ్తున్నారట. 

ఆమ్రపాలి కోసం చిత్ర ఫలితం
వృత్తి రీత్యా తెలంగాణలో డ్యూటీ చేస్తున్నా ఆమ్రపాలి స్వస్థలం విశాఖపట్నం కావడం విశేషం. ఆమ్రపాలి 1982న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కాట వెంకట్ రెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ఒక రిటైర్డ్  ప్రొఫెసర్. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ లెక్చరర్ గా పనిచేశారు. పాఠశాల విద్య వైజాగ్ లోని సాయి సత్య మందిర్ స్కూల్ లో జరిగింది. ఐఐటి మద్రాస్ నుండి ఇంజనీరింగ్ చదివారామె. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39 వ ర్యాంక్ ను సాధించి, ఐఏఎస్ కు ఎంపికయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: