పోలీసుల అంటే ప్రజలను రక్షించేందుకు ఏర్పాటు చేసిన ఉద్యోగులు.  అయితే కొంత మంది పోలీసులు తమ స్వార్థం కోసం ప్రజలను హింసిస్తూ..నానా ఇబ్బందులు పెడుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా ఓ ఇద్దరు పోలీసు అధికారుల అక్రమసంబంధం గుట్టు రట్టు కావడం..రోడ్డున పడటం సంచలనం సృష్టిస్తుంది.  వివరాల్లోకి వెళితే..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అత్యంత సంచలనం సృష్టించిన సంఘటన ఏదైనా ఉందంటే అది ఓటుకు నోటు కేసు.

ఆ కేసులో అప్పటి టిడిపి నేత, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఈ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తర్వాత ఆయన జైలుకు వెళ్లాడు. అప్పట్లో అవినీతి నిరోధక శాఖ మహిళా డిఎస్సీ ఈ కేసును డీల్ చేశారు. ఆమె టీం లో సిఐ మల్లిఖార్జున్ రెడ్డి కూడా ఒకరు. అయితే ఓటుకు నోటు కేసు తాలూకు ఆపరేషన్ విజయవంతం చేసిన ఈ ఇద్దరు పోలీసు అధికారులు రానున్న కాలంలో సన్నిహితులయ్యారు. అయితే ఈ కేసు తర్వాత తన కింద పనిచేసే మల్లిఖార్జున్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం  కుటుంబసభ్యులకు తెలిసింది.

అమెరికాలో ఉండే ఆమె భర్త ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. దీంతో ఏడెనిమిది నెలల క్రితం ఉన్నతాధికారులు ఈ అక్రమ సంబంధం విషయంలో స్పందించి సిఐ మల్లిఖార్జున్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి అతడిని కల్వకుర్తి సిఐ గా బదిలీ చేశారు. కానో మనోడి బుద్ది మాత్రం మారకుండా..ఆ అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అయితే గత రెండు రోజుల క్రితం భార్య సునితారెడ్డికి చెప్పకుండానే అమెరికా నుంచి దిగిన ఆయన సునితారెడ్డి ఇంటికి ఆదివారం రాత్రిపూట వచ్చిన మల్లిఖార్జున్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఇంట్లో తన భార్యను, సీఐని రెడ్ హ్యాండెడ్‌గా అధికారిణి భరణి భర్త బంధువులతో వారిపై దాడికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే సీఐని చితక్కొట్టాడు. ఏఎస్పీ తల్లి, అత్త మల్లికార్జున్ రెడ్డిని చెప్పులతో కొట్టారు. ఈ మొత్తం వ్యవహారమంతా టీవీ చానల్ కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. 

https://www.youtube.com/watch?v=O_9SnvbP-GA

మరింత సమాచారం తెలుసుకోండి: