ఆమ్రపాలి.. ఈ పేరు వింటే చాలు యువకులంతా అలెర్ట్ అయిపోతున్నారీమధ్య.! ఎందుకంటే యువ కలెక్టర్ గా ఆమె చేసిన, చేస్తున్న యాక్టివిటీస్ యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. అంతకుమించి ఆమె అందం మరింతమందిని మంత్రముగ్ధులను చేస్తోంది. వరంగల్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఈ బ్యూటిఫుల్ కలెక్టర్ ఇప్పుడు పెళ్లిపీటలెక్కబోతోంది.

Image result for amrapali iasImage result for amrapali ias

          ఆమ్రపాలి 2010 బ్యాచ్ ఐఎఎస్ ఆఫీసర్. సివిల్స్ లో 39వ ర్యాంక్ సాధించిన ఆమె.. ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో పట్టా పొందారు. ఆ తర్వాత బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా సాధించారు. ఆ తర్వాత ఏబీఎన్ ఆమ్రోలో జూనియర్ రిలేషన్ షిప్ బ్యాంకర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సివిల్స్ కు ఎంపికయ్యారు. మంచి ర్యాంక్ సాధించడంతో సొంత రాష్ట్ర కేడర్ ఎంచుకునే అవకాశం లభించింది. దీంతో ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకున్నారు. మొదట వికారాబాద్ సబ్ కలెక్టర్ గా జాయిన్ అయ్యారు. 2014లో మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణను ఎంచుకోవడం, జిల్లాల సంఖ్య పెరగడంతో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.

Image result for amrapali ias

          యువ కలెక్టర్ కావడం, యాక్టివ్ గా విధులు నిర్వహించడంతో ఆమెకు త్వరగానే మంచిపేరొచ్చింది. అంతేకాక ఆటవిడుపుగా ఆమె అప్పుడప్పుడు ట్రెక్కింగ్, వాకింగ్ తదితర కార్యక్రమాల్లో పాల్గొనడంతో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. వ్యక్తిగత వ్యవహారాలతో ఆమె ప్రముఖంగా వార్తల్లో నిలిచినా.. విధుల్లో మాత్రం ఆమె ఎప్పుడూ నిర్లక్ష్యం వహించలేదు. వరంగల్ అర్బన్ జిల్లాను ఓడీఎఫ్ గా తీర్చిదిద్ది స్వచ్ఛభారత్ లో మేటిగా నిలిచారు. ఆమెతో పనిచేసే అధికారులు కూడా విధుల్లో ఆమె ఎప్పుడూ అలసత్వం వహించలేదని తేల్చారు.

Image result for amrapali ias

          ఆమ్రపాలి సొంతూరు విశాఖపట్నం. తండ్రి కాట వెంకటరెడ్డి ఆంధ్రయూనివర్సిటీలో ప్రొఫెసర్ గా రిటైరయ్యారు. హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఆమ్రపాలి సివిల్స్ శిక్షణలో ఉండగా తనకంటే ఓ ఏడాది జూనియర్ అయిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో ప్రేమలో పడ్డారు. సమీర్ శర్మ ఢిల్లీ వాసి. పెద్దలు కూడా వీరి ప్రేమ పెళ్లికి అంగీకారం తెలపడంతో ఫిబ్రవరి 18న పెళ్లిపీటలెక్కబోతున్నారు. ప్రస్తుతం సమీర్ శర్మ డయ్యూలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: