దళిత ఓట్లు రాజకీయ నాయకులుకు ఎంతో ముఖ్యం. తాము అధికారం లో కి రావడం కోసం వీరి ఓట్లే ఎంతో క్రియాశిలక పాత్ర పోషిస్తాయి. అందుకనే ప్రతి రాజకీయ పార్టీ దళిత లను ఆకర్షించడానికి ఎంతో కృషి చేస్తాయి. వారి మీద ఉత్తితి ప్రేమ ను ఒలకపోస్తారు. అందుకనే బాబు కూడా మంచి మాస్టర్ ప్లాన్ వేశాడు. దేశంలో భాజపాను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దళిత వ్యూహాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఆ ప్రభావం ఏపీ, టీడీపీపై పడకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే దళిత తేజం కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Image result for chandrababu naidu

తాజాగా టీడీపీ వర్క్ షాప్, సమన్వయ సమావేశాల్లో చంద్రబాబు దళిత తేజం గురించి పార్టీ నేతలకు, శ్రేణులకు సూచనలు చేశారు. గుజరాత్ దళిత నేత జిగ్నేశ్ మేవానీని ముందు పెడుతూ రాహుల్ గాంధీ దేశవ్యాప్త దళిత ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దళిత ఉద్యమం బలపడితే బీజేపీతో పాటు టీడీపీ కూడా దెబ్బతినే ప్రమాదముంటుంది కాబట్టి అది తన వరకు రాకుండా చంద్రబాబు ముందస్తు కార్యాచరణకు దిగుతున్నారు.

Image result for chandrababu naidu

అందులో భాగంగానే ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దళిత తేజం కార్యక్రమం చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం అమరావతిలో జరుగుతున్న టీడీపీ ఒక్క రోజు వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ చేసినంత లబ్ధి ఎవ్వరూ చేయలేదని అన్నారు. ఈ విధంగా బాబు వేసిన ప్లాన్ చూసి అందరికి మైండ్ బ్లాక్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: