పవన్ కళ్యాణ్ అడుగుజాడలు చూస్తుంటే ఆడ తెలుగుదేశానికి ఈడ తెలంగాణా రాష్ట్ర సమితికి కొమ్ముకాసే లక్షణాలే కనిపిస్తు న్నాయి. అంతకు మించి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ ప్రయోజనమూ ఒనగూడేలాగా కనిపించటం లేదు. 2014 తరవాత ఒక్కసారిగా పవన్ లోని ఊసరవెల్లి నిద్రలేచింది. నాడు పనిచేయని వాళ్ళను ప్రశ్నిస్తానన్న వ్యక్తి నేడు ప్రశంసించ టం మొదలెట్టేసరికి చాలా మంది విఙ్జుల్లో అనుమాన బీజం అంకురించటం మొదలైంది.
Image result for pavan chandrababu

పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి బెటర్ అని అంటున్నారు. కారణం నాడు ఆయన ప్రజారాజ్యం ప్రారంభించి ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలకు కొంతైనా సేవచేయాలను కున్నారు. కాని తగినంత ఆధిఖ్యత రాకపోవటం పాలనా సామర్ధ్యం అంతగాలేని మృదుస్వభావం ఆయన్ను తన పార్టీని కాంగ్రెస్ కాసారంలో కలిపేలా చేసింది. నాడు ఆయన చేసిందీ సబబు కాకపోయినా తనకు తోచినంతలో సరైన నిర్ణయమే తీసుకున్నట్లు అర్ధమౌతుంది. అయితే నాడు 2009 ఎన్నికలపుడు పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధినేతగా ఉంటూ తెలుగుదేశం పార్టీని ధారుణంగా విమర్శించిన 2014 ఎన్నికల్లో టిడిపి-బిజెపి సంకీర్ణానికి మద్దతునిస్తూ వారు ఈ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు అమలు జరపని పక్షంలో వారిరువురిని "ప్రశ్నిస్తాను" అన్న పవన్ కళ్యాణ్ బిజెపిని పూర్తిగా వదిలేసి, టిడిపిని "ప్రశంసించటం" మొదలెట్టారు.

Image result for pavan chandrasekhara rao

అంతేకాదు దక్షత లేని తమ పార్టీపాలనను చుక్కాని లేని నావలా నడిపి ఆ నేరం "పరకాల ప్రభాకర్" పై వేసేసి వారిపై పగ తీర్చుకుంటానని శపథం చేసారు. అంటే తన వైఫల్యానికి వెరే ఎవరో కారణమంటూ మాట్లాడటం ఆయనకు ఎలా శోభను తెస్తుంది. ప్రజలు చిరంజీవిని నమ్మి ప్రజా రాజ్యానికి ఓటేశారు. కాని అది తనకు తాను చేసుకున్న స్వయంకృత అపరాధం మాత్రమే. అలాంటప్పుడు పరకాల ప్రభాకర్ పై పగ తీర్చుకొనే ఆయన ప్రణాళిక కు పదునుపెట్టి పగతీర్చుకునేదుకు మనం ఆయన చెప్పిన ఉభయ తెలుగురాష్ట్రాల్లో వర్ధిల్లుతున్న అభివృద్ది నిరొధక అధికారపార్టీలకు ఓటెయ్యాలన్న మాట. అంటే అటు ఆంధ్ర ప్రజలు ఇటు తెలంగాణా ప్రజలు తమ అభివృద్ధి మరచి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ పగ తీర్చాలన్నదే అభి మానులు ప్రేక్షకులు ప్రజలు తమ ఓటును అలా సద్వినియోగం చేయాలని ఆయన ఆరాటం లాగా కనిపిస్తుంది. ఆయన ఇంతవరకు ప్రజలకు చేసింది కీడు మాత్రమే కాక మేళ్ళు ఏమైనా ఉన్నాయా అని వెతికితే కలికం మాత్రం కూడా కనిపించవు. ఈసారి పవన్ పవన్ మద్దతు యిచ్చిన పార్టీలకు ఓటెయ్యకుండా ఉంటే తప్ప ఆయన తిక్క ప్రజల తలకు చుట్టుకునేలా ఉంది.


పోనీ ఇంతవరకు పవన్ ప్రజలకు చేసిన సేవలేంటి? రెండుదశాబ్ధాల కాలంలో ఆయన నటించిన 25 సినిమాల్లో 60% సినిమాలు ఫ్లాపులే. చాలామంది నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయారు. కుల ప్రాతి పధికన ఏర్పడ్డ ఆయన అభిమాన సంఘాలు దేశాన్ని ఉద్ధరించటం జరిగే పనికాదని అనుభవఙ్జులు అంటున్నారు. చివరకు మొన్నటికి మొన్న ఆయన నటించిన "అఙ్జాతవాసి" సినిమా డిస్ట్రిబ్యూటర్లను ముఖ్యంగా నైజాం డిస్ట్రిబ్యూటర్ను నిండా నిలువునా ముంచింది. వారిని కోలుకోని దెబ్బ తీసింది.
Image result for pavan chandrasekhara rao
దీనికి కారణం సినిమాలో సరుకు లేకపోయినా సినిమా నిర్మాణ వ్యయం ధారుణంగా పెరగటానికి కారణం కథానాయకుడు పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు  త్రివిక్రం  పారితోషికాలే 40-50 పర్సెంట్ దాటటమే నంటున్నారు. ప్రభుత్వాల సహాయంతో రోజుకు 7 ఆటలు 7 రోజులపాటు నడిపించి బెనిఫిట్ షోలు అత్యధిక టిక్కెట్ వెలతో నడిపించి ప్రేక్షకులను ధారుణంగా ముంచిన సినిమా స్కాంలో పవన్ ది కీలక పాత్ర కాదా? 


ఇందులోను వసూళ్ళ ప్రపంచ రికార్డుల గురించి మాట్లాడే అభిమానులు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల గురించి రికార్డులు పగిలే చరిత్రల గురించి మాట్లాడరు. వేలాధి థియేటర్లలో విడుదలై పరిదిదాటి రోజుకు ఏడు రోజులు ఏడు ఆటలు నడిపి ప్రజా వ్యవస్థలను ఫుల్లుగా వాడేసుకున్న సినిమా వసూళ్ళు కూడా  వసూళ్ళేనా! వెనుక ప్రభుత్వాల మద్దతుతో నడిపిన సినిమాకు ఉన్న ఏ రికార్డైనా వృధాయే! కదా!    

Image result for pavan chandrasekhara rao

పవన్ కల్యాణ్ ఇక సినిమాల్లో ప్రేక్షక విశ్వాసం కోల్పోయాడు. వరుసగా అనెక సినిమాలు ధారుణంగా వైఫల్యం చెంది చివరకు అఙ్జాతవాసి సినిమాతో సినిమాలకు అఙ్జాత వాసిగానే మారిపోయి, ఇక రాజకీయల్లోకి చురుకుగా రాబోతున్నాడు. సినిమా టిక్కెట్ లను అధిక ధరలకు అమ్మించి రోజుకు ఎక్కువలో ఎక్కువ ఆటలు వేయించి దీపం ఉండగానే దండిగా సొమ్ము చేసుకొనేందుకు ప్రణాళిక రచించటం అంటే సొమ్ముచేసు కోవటానికి ప్రభుత్వ చానల్స్ ను వాడుకోవటం కాదా! అధికారంలోకి రాకముందే పవన్ ఇంత రాజకీయ గ్రంధ సాంగుడైతే ఇక అధికారంలోకి వస్తే ప్రజల బ్రతుకెలా ఉంటుందో? అంటున్నారు విమర్శకులు విశ్లేషకులు.  

Image result for pavan chandrasekhara rao

"ఓటుకు నోటు కేసు" విషయంలో పార్టీ స్థిరంగా పాలిస్తుంటే దాన్ని దెబ్బతీయటం ఇష్టం లేక దాన్ని ప్రశ్నిచలేదని కొత్త విధంగా జనానికి సమాధానం చెప్పారు పవన్. సమర్ధ వంతమైన పాలనలో నేరగాళ్ళుంటే పవన్ ప్రశ్నించరన్న మాట. పువ్వు పుట్టకనే ధారుణమైన మూసీ కంపుగొట్టే జనసేన తీరుతో జాగ్రత్తగా ఉండాల్సింది ప్రజలే.  
  
Image result for cash for vote scam   

మరింత సమాచారం తెలుసుకోండి: