టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఇమేజ్ చాలా డిఫరెంట్ అందరి హీరోలకి ఉండే ఇమేజ్ ఒకటి అయితే. పవన్ కు ఉండే క్రేజ్ డిఫెరెంట్ రాజకీయాల రిజల్ట్ ను సైతం మార్చే క్రేజ్ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు మనుషులను అంతలా ప్రబావితం చేస్తాడు పవన్. అలాగే ఆయన నటించే సినిమాలు కూడా వైవిధ్యంగా ఉంటాయి. అయితే రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ అందరి రాజకీయ నాయకుల లాగ సెంటిమెంట్ రాజకీయాలను ఫాలో అవుతున్నాడు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ యాత్ర మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్. యాత్రలో భాగంగా తన మీద ఉన్న బహుభార్యత్వం విషయంలో స్పష్టత వచ్చే విధంగా, రాజకీయాలలో విమర్శలకు తావు ఇవ్వకుండా కొండగట్టు యాత్ర ప్రారంభం సందర్భంగా తన కుటుంబాన్ని తెరమీద తీసుకువచ్చాడు పవన్ కళ్యాణ్.

యాత్రకి బయటకి వెళ్ళే ముందు తన భార్య లేజ్నోవాతో హారతి, వీర తిలకం దిద్దించుకుంటూ సెంటిమెంట్ రాజేశాడు పవన్ కళ్యాణ్. విదేశీ భార్యని పెళ్లి చేసుకున్నాడు భారతీయ మహిళలంటే పవన్ కి గౌరవం లేదు అంటూ ఫైర్ అయిన ఎంతో మంది తన ప్రత్యర్ధులకి పవన్ ఈ సందర్భంగా మంచి ఆన్సర్ ఇచ్చాడు అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: