ఈ రోజుల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచి తీర అధికారం లోకి రాకపోయేసరికి పార్టీ మారే సిగ్గు లేని నాయకులు, ప్రజలను మోసం చేసే నాయకులూ మన రాష్ట్రంలో కొదవ లేదని చెప్పవచ్చు. ఎందుకు పార్టీ మారని ప్రశ్నిస్తే ప్రతి పనికిమాలిన రాజకీయ నాయకుడు ఒక్కటే చెబుతారు. నియోజక వర్గ అభివృద్ధి కోసమని, అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా ఒక ఎమ్మెల్యే మాత్రం తానూ పార్టీ మారింది మంత్రి పదవి కోసమని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు.

Image result for ponguleti srinivasa reddy

ఇలాంటి వారికి ప్రజలు ఓట్లు వేసినందుకు వారే  సిగ్గు పడుతున్నారు. తనకు మంత్రి పదవి వస్తుందంటే తప్ప అసెంబ్లీకి పోటీచేయబోనని ఖమ్మం ఎమ్.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.తనకు మంత్రి అవ్వాలని ఆశ ఉన్నా, అది సాద్యం కాదని కూడా తెలుసునని అన్నారు. తెలంగాణలో ఖమ్మం జిల్లాలోనే కమ్మ సామాజికవర్గం అదికంగా ఉందని, ఇక్కడ వారికే మంత్రి పదవి ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నారు.

Image result for ponguleti srinivasa reddy

తాను వైఎస్ ఆర్ కాంగ్రె స్ నుంచి టిఆర్ఎస్ లోకి చేరినప్పుడు మళ్లీ ఎమ్.పిగా పోటీచేసే అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని, అందువల్ల తాను ఎమ్.పిగానే పోటీచేస్తానని అన్నారు. కెసిఆర్ మాట తప్పే వ్యక్తి కాదని ఆయన అన్నారు.టిడిపితో పొత్తు ఉంటే నామా నాగేశ్వరరావు పోటీచేస్తారన్న వార్తల గురించి ప్రస్తావించగా, అవన్ని ఊహాగానాలు అని అన్నారు. అయితే రాజకీయాలలో పరిణామాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేమని అన్నారు. తాను కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తానన్నది అబద్దమని, ఎవరో ఇలాంటి వదంతాలు సృష్టించారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: