వివాదాస్పద హిందీ చిత్రం పద్మావత్‌ విడుదల తేదీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ అసలు వస్తుందా.. సినిమా విడుదల అవుతుందా.. అయినా థియేటర్లలో ప్రదర్శనలు సజావగా సాగుతాయా.. మధ్యలో కోర్టు తీర్పులు అడ్డుతగులుతాయా.. అల్లర్లు చెలరేగుతాయా.. అంతా సాఫీగా సాగుతుందా.. ఇలా ఈ సినిమా నిర్మాతలకు ఒకటే టెన్షన్..

Image result for పద్మావత్

రిలీజ్ డేట్ దగ్గరకొస్తున్నకొద్దీ పద్మావత్ చిత్రంపై వ్యతిరేకుల ఆందోళనలు పెరిగిపోతున్నాయి. నిరసన ప్రదర్శనలు మరింత తీవ్రమవుతున్నాయి. బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేదించాలన్న డిమాండ్లు జోరందుకుంటున్నాయి. కానీ సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో ఇప్పుడు నిరసన కారులు బందులు, రాస్తారోకోలు చేస్తున్నారు. రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి కూడా.

Image result for పద్మావత్

ప్రధానంగా ఈ సినిమాను అడ్డుకుంటున్న కర్ణీసేన కొన్నిచోట్ల థియేటర్లను కూడా తగులబెట్టేస్తోంది. ఈ పరిణామాల మధ్య ఇంకో గుడ్ న్యూస్ కూడా ఈ సినిమా నిర్మాతలకు వినిపించింది. ఈ సినిమా చూసేందుకు కర్నీసేన అంగీకరించింది. చరిత్రను వక్రీకరించారో లేదో స్వయంగా సినిమా చూసి తెలుసుకోవాలని నిర్మాణ సంస్థ భన్సాలీ ప్రొడక్షన్స్‌ చేసిన విజ్ఞప్తికి కర్నీసేస పాజిటివ్ గా రియాక్టయ్యింది. సినిమా చూసేందుకు రెడీ అని ప్రకటించింది.

Image result for karnisena

మరోవైపు పద్మావత్‌ చిత్ర విడుదలను నిషేధించడంపై స్టే విధిస్తూ ఇచ్చిన ఆదేశాల్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు దాఖలుచేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. పద్మావత్‌ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్లకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని 


మరింత సమాచారం తెలుసుకోండి: