దావోస్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ఒక అద్భుతం ఒక ఆశ్చర్యం. నిజంగా నరేంద్రుడే 9స్వామి వివేకానంద) ఈ నరెంద్రుణ్ణి ఆవహించినంత అద్భుత ప్రసంగం లాగే  అనిపించింది ఈ ప్రసంగం వింటుంటే. ఒక ఆర్ధిక సదస్సు లో మూడు ప్రధాన అంశాలైన ప్రకృతి పరిరక్షణ, మానవ సంబంధాల ఆవశ్యకత, మానవత్వం-ఆధ్యాత్మిక దృక్పథం తో సమస్యల పరి శీలన పై ప్రసంగ ఝరి ఒక మహోన్నతం. 
Related image
పై విషయాలను భారత ప్రజాస్వామ్య వైభవం, భారత తాత్విక చింతనలో ఓలలాడించి మాట్లాడి ఒప్పించడం, ఆపై మెప్పిం చడం మొత్తం ఒక అద్భుతం క్రిక్కిరిసిన హృదయ స్పందనల మధ్య మహాద్భుతం! 55 నిమిషాల సుమధుర ప్రసంగం ఆద్యంతం అమోఘం అనితర సాధ్యం. విని తీరాలి తప్ప చెప్పటానికి నా బాష చాలదు. "వెల్త్ కె సాథ్ వెల్ నెస్-హెల్త్ కె సాథ్ జీవన్ కె హోల్ నెస్ (సమగ్రత) కావాలంటే మీరు భారత్ రండి-ప్రగతి తో పాటు శాంతి కోరుకుంటే మీరు భారత్ రండి! ఈ ఉపన్యాసంలో మన ప్రధాని వేసిన భారత సాంస్కృతిక ముద్రలే ఆ తుదిపలుకులు!
Image result for davos switzerland world economic forum 2018
భిన్నమతాలు, సంస్కృతులు, భాషలు కలిగిన భారతదేశం లో ప్రజాస్వామ్యం భిన్నత్వం లో ఏకత్వం - అందరినీ ఒకే తాటిపై నిలుపుతున్న అద్భుత మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే  "భారతీయ ప్రజాస్వామ్యం రాజకీయ విధానమే కాదు, భారతీయ జీవన శైలి" అని హృదయంగమంగా చెప్పారు. దావోస్‌ లోని "ప్రపంచ ఆర్థిక సదస్సు" లో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. 
Image result for davos switzerland world economic forum 2018
1997లో అప్పటి భారత ప్రధాని దేవెగౌడ దావోస్‌ లో ప్రసంగం తర్వాత మళ్లీ 20 ఏళ్లకు నరేంద్ర మోదీ ఈ వేదికపై ప్రసంగిం చడం ఒక విశేషమైతే, ప్రపంచ ఆర్థిక సదస్సులోని ప్రత్యేక ప్లీనరీలో నరెంద్ర మోదీ మాట్లాడిన తీరు అమోఘం అనితర సాధ్యం. ఈ నరెంద్రునిలో ఆ నరెంద్రుని ఆత్మ కలిసిన తరుణమది. మానవులంతా భూమిపుత్రుల మనే మాటను గుర్తు పెట్టు కొని మనుగడ సాగించాలన్నారు. 

Image result for davos switzerland world economic forum 2018

నేటి తరం సుఖం సౌఖ్యంకోసం ప్రకృతి విధ్వంసం చేయొద్దని నేటి జనావళికి హితవు పలికారు. ప్రకృతిని పరిరక్షించాలన్నా రు. 1997లో భారత జీడీపీ 400 బిలియన్‌ డాలర్లు మాత్రమేనని, ఇప్పుడు అది ఆరు రెట్లకు పైగా పెరిగిందన్నారు. నాటికి నేటికి భారత ఆర్థిక వ్యవస్థలో భూమ్యాకాసలకున్నత తారతమ్యం తో కూడిన పలు ఉహాతీత మార్పులు సంభవించాయని తెలిపారు. 
india gdp 2004-05 series
పలు పరస్పర ఆధారిత అంశాల తో సమాజ అభివృద్ధిలో "ఆర్థిక వేదిక సదస్సు" ఒక నావకు చుక్కానీ లాగా వ్యవహరిస్తోందన్నారు. సాంకేతికన్గా ఇంటర్నెట్‌, బిగ్‌-డేటాలతో ప్రపంచమంతా చొన్నెక్ట్ (అనుసంధానం) అవుతుండగా. సైబర్‌ పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేయడమే అసలైన సవాల్‌గా మారిందన్నారు. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని మోదీ చెప్పారు. 

india gdp const prices

వసుధైక కుటుంబం (ప్రపంచమే ఒక కుటుంబం అన్న భావన) అనేది భారతీయ తాత్విక ఆధ్యాత్మిక చింతన అని వాతావరణ మార్పులు విశ్వం మనుగడకు సవాల్‌గా మారాయని ఆయన ఉద్వేగం ఆందోళన వ్యక్తంచేశారు. దేశాభివృద్ధి కోసం సాంకేతిక విజ్ఞానం సరైందే అయినప్పటికీ అది చెడు చేసేలా ఉండకూడదన్నారు. 


ఉగ్రవాద సమస్య మొత్తం ప్రపంచానికే ప్రమాధంగా మారి పెను సవాళ్లు విసురుతోందన్నారు. సమ్మిళిత అభివృద్ధి అనేది 120 కోట్ల మంది భారతీయుల ఆశయమన్నారు.


వ్యాపార అనుకూల ర్యాంకింగ్‌ లో భారత్‌ స్థానం ఇటీవల గణనీయంగా మెరుగు పడిందని నరెంద్ర మోదీ అన్నారు.  ప్రపంచ ఆర్థిక ప్రగతిలో మరింత క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్‌ సర్వసంసిద్ధంగా ఉందన్నారు. ఏ ఒక్క వర్గానికో కాకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలను అందించాలనేది తమ విధానమని నరెంద్ర మోదీ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: