ఒక వారం పాటు జరిగే సంక్రాంతి పండుగ సంబరాలను పురస్కరరించుకొని ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గానికి వస్తుం టాడు అలాగే ఈ ఏడాది సంక్రాంతి రోజున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఎదురైన ఈ చేదు అనుభవం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణా రాష్ట్రంలోని పెద్దపల్లి నియోజక వర్గ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి, సంక్రాంతి పండగ నాడు తన సొంత నియోజకవర్గానికి వస్తున్నారన్న సమాచారం "కాల్వ శ్రీరాంపూర్ మండలం" లోని  "గంగవరం"  గ్రామ రైతులకు తెలిసింది. ఈ విషయంలో ఆ ప్రాంత రైతులంతా సదరు శాసనసభ్యుణ్ణి నిలదీయాలని నిర్ణయించు కున్న ఆ గ్రామస్థులు ఆయన కోసం నిరీక్షిస్తూ ఆయన తప్పించుకు పోకుండా దారి కాశారు.
Image result for pavan kalyan political travel in telangana

వారందరిని చూసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, తన కారు దిగి వారిని శాంతపరచే ప్రయత్నం మాత్రం చేశారు. పొలాలకు శ్రీరాం సాగర్ ప్రోజెక్ట్ నుంచి నీరు విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని ఆగ్రహంతో ఉన్న రైతులు మనోహర్ రెడ్డిని అక్కడికక్కడే నిలదీశారు. ప్రభుత్వం నీరందిస్తామని చెప్పడంతో పంటలు వేశామని, సకాలంలో నీరు విడుదల చేయక పోవడం తో వందల ఎకరాల్లో పంటలు ఎండి పోయి సర్వ నాశనమయ్యాయని మండిపడ్డారు. 

Image result for dasari manohar reddy telangana peddapalli MLA

ఈ ఊహించని పరిణామానికి ఒక్క సారిగా డంగై, ఖంగుతిన్న శాసనసభ్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు (జారుకునేందుకు) ప్రయత్నించారు. అయితే ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు ఆయనను వెంబడించారు. పోలీసులు, ఎమ్మెల్యే కు రక్షణ కల్పించి నెమ్మదిగా కారులో ఎక్కించి సురక్షితంగా ఆ గ్రామం దాటించారు. ఈ ఘటనపై ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు గుర్రుగా కూడా  ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ విషయం పై ఆయన అధికారికంగా మాత్రం స్పందించలేదు. ఒక వైపు సీఎం కేసీఆర్, ప్రజలందరికీ 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని, నిరంతరం నీరు సరఫరా చేస్తు న్నామని వాగాడంబరం ప్రదర్శిస్తున్న సందర్భంలో ఈ సంఘట్టన  జరగడంపై త్రెలంగాణా ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లు కంపించిపోతుందన్నట్లు తెలుస్తోంది.

Image result for dasari manohar reddy telangana peddapalli MLA

అంతేకాకుండా కెసిఆర్ సర్కార్ పై తెలంగాణ ప్రజల హృదయాంతరంగంలో ఇంత వ్యతిరేకత,  అదీ ఈ స్థాయి ఈ ఎత్తులో ఉండడం పలువురిని అవాక్కవటమే కాదు   ఆశ్చర్యానికి గురిచేసింది. 


నిజంగా చెప్పాలంటే అదేదో సినిమాలో వారి ప్రజాప్రతినిధి వస్తున్నట్లు తెలుసుకున్న గ్రామస్థులు దారికాసి ఆయన అధికార వాహన శ్రేణిని అడ్డుకుంటారు. ఆ రైతులను శాంతపరుద్దామని ఆ ప్రతినిధి వారి దగ్గరకు వెళతాడు. ఆ రైతులందరితో మాటా మంతీ జరపాలని భావిస్తాడు.అయితే అనూహ్యంగా ఆ రైతులు, తమ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని నిష్కర్షగా సదరు ప్రజాప్రతినిధిని అక్కదికక్కదే నిలదీస్తారు.

Image result for pavan kalyan political travel in telangana
అంతే కాదు ఆ సదరు ప్రతినిధిని పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఈ దెబ్బతో ఆ ప్రజాప్రతినిధి అతికష్టం మీద అక్కడ నుండి పలాయనం చిత్తగిస్తాడు. ఆ సినిమా కథలా మన తెలంగాణా ప్రజలు స్పందించారు.


ఇది చూసైనా మన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో లాగా  "ప్రశ్నిస్తాను" అని చెప్పి, ఇప్పటిలా  "ప్రశంసిస్తే" ఆ రెండింటి భేధం బాగా తెలిసిన ఇక్కడి ప్రజలు పవన్ చేత బాత్ రూంలో ఆసనాలు వేయిస్తారని అర్ధం చేసుకుంటే మంచిదని కొందరు కొత్తగూడేం వాసులు అనటం జరిగింది.  ఏదో నాటకమాడి "అఙ్జాతవాసి" సినిమాకు ఒక "ఆట" ఎక్కువేసుకోవటానికి పవన్ బొంకిన తీరు ఇదైతే ఫర్వాలేదు. ఒకవేళ నిజంగానే కావాలని అభద్ధాలాడితే ఇక్కడ జనాలకు ముఖ్యంగా ఈ  "సినిమా నాటకా లేసే వాళ్ళ" చేత  పాసనాలు పెట్టిస్థారని తెలుసుకుని మెదిలితే, మొదటికే కాదు! చివరకూ మంచిదే!.  

Image result for pavan kalyan political travel in telangana

మరింత సమాచారం తెలుసుకోండి: