మొన్నటికి మొన్న 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి వేటు వేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఆప్ ఎమ్మెల్యేలు అసలు పార్లమెంటరీ సెక్రటరీలుగా బాద్యతలే చేపట్టేలదట. అలాంటివారిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయడం ఏమిటో అర్ధం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఐతే.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల త‌ర‌హాలోనే తెలంగాణా రాష్ట్రంలోనూ పార్ల‌మెంటు సెక్ర‌ట‌రీలుగా కొన‌సాగిన ఆరు మంది టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల‌పై కూడా ఆప్ త‌ర‌హాలోనే అన‌ర్హ‌త వేటు వేస్తారా..!?



ఇప్పుడు  తెలంగాణలో ఆసక్తిరేపుతున్న ప్రశ్న ఇది. టీఆర్ఎస్ ఎమ్మల్యేలపైనా వేట వేయాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. డిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలు ఇరవై మందిపై అనర్హత వేటు పడిన నేపద్యంలో కాంగ్రెస్ ఈ డిమాండ్ చేసింది. పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు లాభదాయకత కిందకే వస్తాయని, ఆప్‌ ఎమ్మెల్యేల తరహాలోనే తొమ్మిదిమంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఈసీని రేవంత్ కోరారు. 

aap mlas ec కోసం చిత్ర ఫలితం

టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటు కార్యదర్శులుగా నియమించిందని, అలాగే, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో ఉన్నారని రేవంత్‌ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. పార్ల‌మెంటు సెక్ర‌ట‌రీలుగా కొన‌సాగిన  ఆరు మంది ఎమ్మెల్యేలే కాకుండా లాభ‌దాయ‌క‌మైన అద‌న‌పు ప‌ద‌వుల‌లో నియ‌మితులైన మ‌రో ముగ్గురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌పై కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కూడా డిమాండ్ చేసారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తికి, చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్‌కు ఫిర్యాదు చేసారు. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన 6 మంది ఎమ్మెల్యేలను గతంలో పార్లమెంటు కార్యదర్శులుగా నియమించడం జరిగింద‌ని రేవంత్ తన ఫిర్యాదులో వివరించారు.

aap mlas ec కోసం చిత్ర ఫలితం
వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే డి.వినయ్ భాస్కర్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సిఎం కార్యాల‌యంలోనూ,మహబూబ్ న‌గర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్, తుంగతుర్తి ఎమ్మెల్యే జి.కిశోర్ కుమార్ డెప్యుటీ సిఎం కార్యాలయంలోనూహుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్ విద్యాశాఖామంత్రి కార్యాలయంలోనూ,ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి రాష్ట్రవ్యవవసాయ శాఖ మంత్రి కార్యాలయంలోనూ   పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2014, డిసెంబర్ 29న జిఓ ఎంఎస్ నెంబర్ 173ని జారీ చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. త‌న ఫిర్యాదును ఆన్‌లైన్ ద్వారా రాష్ట్ర‌ప‌తి, చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌, స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌కు పంపామ‌ని రేవంత్ ఈ సంద‌ర్భంగా వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: