తెలుగు రాష్ట్రాల్లో గజల్ సాంగ్స్ తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న  గజల్ శ్రీనివాస్ ఇద్దరు మహిళలతో మసాజ్ చేయించుకోవడమే కాకుండా, తన ఇంటి పని మనిషితో శృంగారం, ఓరల్ సెక్స్ చేయించుకునే వీడియో క్లిప్పింగ్స్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గజల్ శ్రీనివాస్ వద్ద వర్క్ చేసే ఓ మహిళ కొంత కాలంగా గజల్ శ్రీనివాస్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని..తనను వశపర్చుకోవడానికి అతని వద్ద పనిచేసే పార్వతి అనే మహిళతో తనను ఫోర్స్ చేయించే వారని..దీంతో అతని నిజస్వరూపాన్ని బయట పెట్టేందుకు స్టింగ్ ఆపరేషన్ చేసి రాసలీల గుట్టు మొత్తం వీడియో తీసింది. 

అప్పటి వరకు సొసైటీలో ఎంతో గౌరవంగా ఉండే గజల్ శ్రీనివాస్ గలీజు పనులు బట్టబయలయ్యాయి.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు పంపారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.ఇప్పటికే రెండు సార్లు బెయిల్ కోసం పిటీషన్ పెట్టుకోవడం కోర్టు తిరస్కరించడం జరిగింది. రిమాండ్‌లో ఉన్న గజల్‌కు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది.
 పని మనిషితో శృంగారం
గజల్‌కు బెయిల్‌ ఇవ్వవద్దంటూ పంజాగుట్ట పోలీసులు కౌంటర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసులో ఇంకా చాలామందిని విచారించాల్సి ఉందని, ఇప్పట్లో బెయిల్‌ దొరికితే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న పార్వతిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదంటూ కోర్టు పోలీసులను ప్రశ్నించింది. కాగా, పార్వతి కూడా ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 

తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న గజల్‌ శ్రీనివాస్‌‌కు బుధవారం నాంపల్లి కోర్డు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే ఏ-2 నిందితురాలిగా ఉన్న పార్వతికి కూడా ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి బుధ, ఆదివారాల్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు షరతు విధించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: