సినీ నటుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ బలోపేతం చేయడానిక కంకణం కట్టుకున్నారు.   ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్న విషయం తెలిసిందే...ఇప్పటికే కరీంనగర్ లో కొండగట్టు అంజన్న దర్శనం చేసుకొని తన యాత్రం ప్రారంభించారు.  తెలంగాణ నేల తల్లికి ఆఖరి శ్వాస వరకు రుణపడి ఉంటానని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

'చలోరే..చలోరే.. చల్' కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో జై తెలంగాణ స్లోగన్‌తో తన ప్రసంగాన్ని ప్రారంభించారు పవన్.. 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని, తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ అంటే తనకు చాలా ఇష్టమని, తన జీవిత కాలంలో ఎక్కువగా పెరిగింది ఇక్కడేనని తెలిపారు. ఏడు ఆలోచనా విధానాలతో తన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నట్లు పవన్ పేర్కొన్నారు."మన స్థాయి ఎంత, మన శక్తి ఎంత, మన వనరులు ఎంత వీటన్నింటిని ఆలోచించి 2019 ఎన్నికలకు సిద్ధమవుదాం అన్నారు. 
Pawan kalyan
 నేను మీ ఇంట్లో వాడినే, మీ అన్నను.. మీ తల్లిదండ్రులకు నేనొక బిడ్డను.. మీ అక్కాచెల్లెళ్లకు నేనొక అన్నను.. ఆ విషయం మర్చిపోకండి" అని పవన్ అన్నారు. తెలంగాణ అంటే తనకు చాలా ఇష్టమని, తన జీవిత కాలంలో ఎక్కువగా పెరిగింది ఇక్కడేనని తెలిపారు. ఏడు ఆలోచనా విధానాలతో తన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.  ఈ రోజు ఆయన ఖమ్మంలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మానవత్వంతో కూడిన రాజకీయాలను మాత్రమే జనసేన చేస్తుందన్నారు.

ఇదిలావుండగా ఖమ్మం పట్టణంలోకి పవన్ కాన్వాయ్ ప్రవేశిస్తుండగా అనూహ్య ఘటన జరిగింది. ఆయన ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తుండగా అగంతకుడు చెప్పు విసిరాడు. అది గురి తప్పి కారు బానెట్ పై పడింది. నన్ను ఎంతమంది విమర్శించినా సంతోషమే నన్న పవన్… ప్రజా సమస్యల  పరిష్కారం కోసం తనపై ఎలాంటి దాడులు జరిగినా సిద్ధమేనన్నారు.

నాపై ఎన్నిసార్లు దాడి చేసినా భరిస్తాను కానీ ఎదురుదాడి చేయనన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.   రాజకీయాల్లో కుల, మత, ప్రాంతీయ వాదాలను పక్కన పెట్టి ఒకరినొకరు గౌరవించు కోవాలని, అవినీతిపై రాజీలేని పోరాటం చేయాలంటూ జనసైనికులకు పిలుపునిచ్చాడు పవన్‌కళ్యాణ్. చివరకు జై తెలంగాణ, జై హింద్ నినాదాలతో తన ప్రసంగాన్ని ముగించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: