ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు.  అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఇక్కడ ప్రతిఒక్కటీ కొత్తగా ఏర్పాటు చేసుకునే పరిస్థితి నెలకొంది.  ముఖ్యంగా ఏపీకి రాజధాని కోసం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు.  మరోవైపు ఏపీ నుంచి అన్ని కార్యక్రమాలు అమలయ్యే తీరుగా సెక్రటేరియట్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ కూడా అక్కడ నుంచి నిర్వహిస్తున్నారు.  ఇక రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు అహర్శిశలూ శ్రమిస్తున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో ఆయన విదేశీ పెట్టుబడుల కోసం వీదేశీ పర్యటనలు చేస్తున్నారు. 

ఓ వైపు టూర్ కొనసాగిస్తూనే..ఇక్కడి జనంతో మాత్రం టచ్ లోనే వున్నారు. వీడియో కాల్స్ ద్వారా గిరిజనులతో మాట్లాడి దావోస్ నుంచే పాలన సాగిస్తున్నానన్న భావన కలిగించారు కూడా. కొడుకు లోకేష్ పుట్టిన రోజు వేడుక కూడా అక్కడే కానిచ్చేశారు. ఇటు పరిపాలనా విభాగాలన్నీ వాటంతటవే నిరాటంకంగా సాగిపోతున్నాయి. ఇదిలా ఉంటే..ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ తెగ హల్ చల్ చేస్తుంది.  టాలీవుడ్ నటులు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకి స్వయానా వియ్యంకుడు.. ఐటీ మంత్రి లోకేష్ కి పిల్లనిచ్చిన మామ కూడా! ఇది తెలిసిన విషయమే.

ఇదేం కొత్త విషయం కాదు కదా..అనుకుంటున్నారా..ఇక్కడే పెద్ద ట్విస్ట్ నెలకొంది.  సీఎం చంద్రబాబు  టూర్లో వున్న ఈ గ్యాప్ లోనే.. బాలయ్య కొంత ఉత్సాహం కనబరిచారని, ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని సమీక్ష నిర్వహించారని చెబుతున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసులో లేపాక్షి పుస్తకాలకు సంబంధించి మంత్రి దేవినేని ఉమతో పాటు కొంతమంది ఉన్నతాధికారులను కూర్చోబెట్టుకుని బాలయ్య రివ్యూ చేశారని తెలుస్తోంది. అయితే ఏపిలో మిగతా 175 మంది ఎమ్మెల్యేల్లాగే తనూ ఓ ఎమ్మెల్యే..కానీ దగ్గరి బంధువు అని కొస్త చొరవచూపారంతే.  ఇక సీఎం సీట్లో కూర్చున్న బాలయ్యను చూసి అధికారులు అవాక్కయినప్పటికీ.. వెంటనే తేరుకుని తమాయించుకున్నారట! ప్రోటోకాల్ ప్రస్తావన తీసుకొచ్చి బాలకృష్ణను హెచ్చరిద్దామనుకున్నారట. 
Image result for chandrababu balakrishna
కానీ ఆ సాహసం చేసే ధైర్యం అక్కడ ఎవ్వరికుంటుంది గనక? మంత్రి దేవినేని కూడా ఈ ఎపిసోడ్ లో ప్రేక్షక పాత్ర వహించారు. మరి ఈ విషయం సీఎం చంద్రబాబు చెవిన పడితే..ఎలా రియాక్ట్ అవుతారో..గతంలో ‘వెన్నుపోటు’ కథకి సీక్వెల్  అవుతుందేమో అని ప్రభుత్వ వ్యతిరేక వర్గీయులు కథనాలు అప్పుడే మొదలు పెట్టారు.  అయితే బాలకృష్ణ ఓ నటుడు..జాలీగా ఉండే వ్యక్తి..ఆ చొరవతోనే ఈ సీట్లో కూర్చొని ఉంటారు..అందులో ఎలాంటి దురుద్దేశం ఉండదని టీటీడీపీ వర్గీయులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: