రాజకీయాల్లో అన్ని రోజులూ ఒకలా ఉండవు.. కాలం కలసిరాకపోతే తాడు కూడా పామై కరుస్తుందట.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు టైమ్ బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణలో ఆయన ఆడింది ఆట.. పాడింది పాట.. గట్టి విపక్షమూ లేదు. తప్పులు నిలదీసే దమ్ము మీడియాకూ అంతగా కనిపించడం లేదు. కానీ.. రేవంత్ రెడ్డి వంటి కొందరు నేతలు మాత్రం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 

revanth vs kcr కోసం చిత్ర ఫలితం
తెలుగుదేశంలో ఉండి కేసీఆర్ ను ఏమీ చేయలేమని తెలుసుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పంచన చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఒక్కొక్కటిగా వ్యూహాలు పన్నుతున్నారు. రాజకీయంగా కేసీఆర్ బలంగా ఉన్న సంగతి రేవంత్ రెడ్డికీ తెలుసు. అంతే ఆయన లా పాయింట్ కోణంలో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చట్టం ముందు ఎంత పెద్ద నేతలైనా తలవంచక తప్పదు కాబట్టి ఆ రూట్లో నరుక్కొస్తున్నారు. 

revanth vs kcr కోసం చిత్ర ఫలితం
మొన్నటికి మొన్న ఆప్ ఎమ్మెల్యేలై రాష్ట్రపతి అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అందుకు కారణమూ చాలా చిన్నదే. ఎమ్మెల్యేలు లాభదాయకపదవులు చేపట్టారన్నది అభియోగం. కానీ వాస్తవానికి వారు పార్లమెంట్ సెక్రటరీ పదవులకు జీతం కూడా తీసుకోలేదట. కానీ ఆ పదవి తీసుకోవడమే ఈ సీ దృష్టిలో తప్పయింది. అందుకే తెలంగాణలోనూ అలాంటి ఎమ్మెల్యేలను గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. ఇది కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. 

law goddess కోసం చిత్ర ఫలితం

అలాగే గతంలో కేసీఆర్ అండ్ కో పార్టీ ఫండ్ కోసం గులాబీ కూలీ కార్యక్రమం నిర్వహించారు. ఇది ఒక రకంగా చందాల వసూలు కార్యక్రమమే. మరీ మాట్లాడితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి వసూలు చేయడమే. ఈ కార్యక్రమం గురించి కూడా రేవంత్ రెడ్డి.. ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌పై స్పందించిన హైకోర్టు.. ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కూలీ పేరిట బహిరంగంగా లక్షలాది నిధులు సేకరించడం అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్టవుతుందని.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈసీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: