మన రాజకీయాల్లో కుల ప్రస్తావన చాలా కామన్ అయ్యింది. ఒకప్పుడు వీటి గురించి బహిరంగంగా మాట్లాడాలంటేనే ఫీలయ్యేవారు.. ఇప్పుడు ప్రతి కులానికో కార్పొరేషన్ పెట్టేసి ఓట్లు దండుకునేందుకు ముందుకొచ్చేస్తున్నారు. అంతేనా.. కులాల వారీగా టార్గెట్లు పెట్టి మరీ పథకాలు ప్రకటిస్తున్నారు. సహజంగానే ఎక్కువ సంఖ్యలో జనాభా ఉన్న కులాలకు ఇది కాస్త ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ పేరు కోసం కార్పొరేషన్లు పెట్టినా వాటిని పట్టించుకోవడం లేదన్న విమర్శలూ వస్తున్నాయి. 



తాజాగా.. ఏపీలో ఇదే సీన్ నడుస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఎక్కువ సంఖ్యలో జనాభా ఉన్న కాపుల ఓట్లపై కన్నేశారు. వారి కోసం ఓ కార్పొరేషన్ నెలకొల్పారు. అంతేనా.. ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నానని ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది. మరి అన్ని నిధులు కేటాయిస్తే.. ఎన్ని పథకాలు రూపొందించాలి.. రూపొందించిన వాటిని సక్రమంగా అమలు చేయాలి..

kapu corporation కోసం చిత్ర ఫలితం

మరి ఈ పనులన్నీ చేయాల్సిన అధికారులను నియమించాలి కదా.. కానీ.. చంద్రబాబు కాపు కార్పొరేషన్ నిర్వహణను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కీలకమై ఈ కాపు కార్పొరేషన్ కోసం.. మేనేజింగ్ డైరెక్టర్ గా ఓ ఐఏఎస్ స్థాయి అధికారిని కేటాయించలేదన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారితోనే ఆయన బండి నడిపించుకొస్తున్నాడని మండిపడుతున్నారు. 

ap brahmin corporation కోసం చిత్ర ఫలితం

అలాగే ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ పరిస్థితి కూడా.. గతంలో ఈ కార్పొరేషన్ కు దాదాపు ఓ ఆరునెలల పాటుమేనేజింగ్‌ డైరక్టర్నే నియమించలేదట. ఆ తర్వాత కాలంలో  ఐఏఎస్‌ అధికారి పద్మ ఈ కార్పొరేషన్ ఎండీ నియమించారు. ఆమె కాస్త కుదురుకుని పని ప్రారంభించేలోపే ఇప్పుడు ఆమెను అక్కడ నుంచి బెజవాడ దుర్గ గుడి ఈవోగా  బదిలీ చేశారు. బ్రహ్మణ కార్పొరేషన్ ఎండీ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.  గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు వేసి గెలిపించిన కాపు, బ్రహ్మణ కులాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆ రెండు కులాల నాయకులు విమర్శిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: