సినిమాలకి పూర్తిగా టాటా చెప్పేసి ఇక రాజకీయాలపై పూర్తి దృష్టి సారించాడు పవన్. ఎన్నికలలో ఈ సారి బరిలోకి దిగుతున్నాడా లేదా అని ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఒక సారేమో బలంగా ఉన్న ప్రాంతాలలోనే పోటీ చేస్తాం అంటాడు, ఇంకోసారి పార్టీలకు కేవలం మద్దతు ఇస్తాం అని స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నాడు. ఏది ఏమయినా ప్రస్తుతం పార్టీకి కూసింత పాపులారిటీ ఉండాలనే ఎన్నికల వ్యుహంలో భాగంగా యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.


ఇలా తెలుగు రాష్టాలలో మూడు రోజుల యాత్ర  పూర్తిచేసుకొని  హైదరాబాద్ కు చేరుకున్నాడు. అయితే పవన్ కు అనూహ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుండి ఫోన్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ చేసిన యాత్రను ఆయన  అభినందించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులను చర్చించడానికి ఈ మేరకు ఢిల్లీ వచ్చి తనతో కలవవలసినదిగా పవన్ ను అమిత్ షా ఫోన్లో ఆహ్వానించారు.


అయితే ఈ ఆహ్వానంపై పవన్ కు పెద్దగా ఆసక్తి లేనట్లుంది. ఆయన ఆహ్వానముపై  సమాధానమిస్తూ తాను త్వరలోనే ఢిల్లీ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై ప్రధాని మోడీతో చర్చిస్తానని, అప్పుడు మిమ్ములను కలుస్తానని అన్నాడు. అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడం వెనక ఏదో భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. అయితే అమిత్ షా పట్ల పవన్ వ్యవహరించిన తీరు అందరికి నవ్వు పుట్టిస్తుంది. ఒక జాతీయ పార్టీ నాయకుడు ఆహ్వానించినా వెళ్లకుండా మోడీని కలిసినపుడు కలుస్తా అని అనడంపై పవన్, అమిత్ షా ను  ఏకిపారేశాడు అని అందరూ అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: