మనదేశం ఆర్ధికంగా ఎదగాలంటే బడ్జెట్లు "మౌలిక సదుపాయాల పునాదులు" పై నిర్మించబడాలి. ఉదాహరణకు కేంద్ర బడ్జెట్ -2018 లో వ్యవసాయానికి ఆరోగ్యానికి పెద్ద పీఠలు వేశామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి స్వంత డబ్బా కొట్టు కున్నారు.


ఈ రెండు రంగాలనే ఉదాహరణలుగా తీసుకుందాం. వ్యవసాయ రంగానికి బడ్జెటులో ఎంత కేటాయింపులు చేసినా దానికి మౌలిక సదుపాయాల పునాదులు లేకపోతే - నిజంగా ప్రయోజనం చేరా ల్సిన రైతులకు - ఆ రైతు ఉత్పాదన అనుభవించే వినియోగదారునికి ఎలాంటి “వయా మీడియా లేకుండా” అంటే “దళారీ వ్యవస్థ ద్వారా కాకుండా” ప్రత్యక్షంగా అందాలి. అపుడే రైతుకు గిట్టు బాటు ధర వినియోగదారునికి సరసమైన ధర లభిస్తుంది.


ఈ బడ్జెట్ కేటాయింపులు రైతులకు సరైన సమయానికి సరసమైన ధరకు వ్యవసాయ పరికరాలు పొలాలకు పంటలకు ఎరువు లు మందులు అందుబాటులో లభించాలి అంతే కాదు రైతు తన పంటపై అధిక విలువ పొందాలను కుంటే కొంతకాలం నిలువ ఉంచుకోవాలంటే దానికి అనువైన "స్టోరెజ్ సదుపాయాలు ఆపై మార్కెటింగ్ సదు పాయాలు" తో కూడిన మౌలిక వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ నీతినియమం, విధివిధానాల రూపకల్పన తో సమర్ధవంతమైన "నియంత్రణ వ్యవస్థ" తప్పని పరిస్థితులను సైతం శాసించగలగాలి.

Finance minister delivering the budget speech in the Parliament on Wednesday. Photo: PTI

అంటే: 

Image result for agriculture in india

*భూసారాన్ని పరిరక్షించే ఎరువులు పంటలను రక్షించే కీటక సంహార  పంట సంరక్షక  నిచ్చే పురుగు మందులు గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా, పరిణామాత్మకంగా అందించాలి. 

*పంట విత్తిన నాటినుండి వినియోగదారుని చేరేవరకు వివిధ దశలకు "తగినంతగా టైలర్ మేడ్ ఇన్సూరెన్స్"  అందజేయాలి.

*పంట విత్తటం నుండి వ్యవసాయ పరికారాలు, ఎరువులు, పురుగు మందులు, పంట నిలువ చేసు కోవటానికి  “స్టోరేజ్ సెల్స్” - తగినంతగా రైతుకు వివిధ దశలకు పంట “సెక్యూరిటీ గా ఋణా సదుపాయాలు”  అందించే ఏర్పాట్లు కల్పించాలి.

*ఈ మొత్తం పంట కాలానికి రైతు కుటుంబ పోషణకు వారి  స్థాయికి పైసా తక్కువ ఎక్కువ కాకుండా తగినంత పోషణ ఖర్చులకు స్వల్పకాలిక, స్వల్ప ధరలో ఋణం అందించటం అవసరం.    

ఇక రెండో ఉదాహరణ గా ఆరోగ్యరంగాన్ని పరిశీలిద్ధాం. ఈ రంగానికి ఎంత కేటాయించామన్నది ముఖ్యంకాదు దీని అమలులో ప్రత్యేక విశ్లేషనాత్మక నియంత్రణ వ్యవస్థ అదీ మౌలిక సదుపాయలు అందరికి జీవన ఆరోగ్య భీమా" తో పాటు అవసరం కాబట్టి అలభ్యం కాకూడదు.

Image result for agriculture in india

అంటే:

primary health centre కోసం చిత్ర ఫలితం

*గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలి. ఇక్కడే కుటుంబ వైద్యుల సదుపాయాలు రిజిస్ట్రేషన్ ప్రతి వ్యక్తి పొందాలి.

*మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి ఇక్కడే గ్రామ స్థాయి ఆరోగ్య కేంద్ర సిఫారస్ పైనే వైద్యం జరగాలి.

*జిల్లా స్థాయిలో సంపూర్ణ వైద్య సదుపాయాలు ఉన్న జిల్లా ఆరోగ్య కేంద్రాలు పని చేస్తూ ఉండాలి. ఇక్కడ మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిఫారస్ ముఖ్యం.

*వీటన్నిటికి ప్రతి దశలో కొన్ని నియమ నిబందనలతో సిఫారస్ పత్రాలు పొందటానికి నియంత్రణ వ్యవస్థ ఉండాలి - ఆరోగ్యం కోరుకునే వారు వైద్య సదుపాయాలు పొందాలి.

*ఇక్కడ అన్నీ దశల్లో అనేక మంది అర్హత సాధించిన వైద్యులు, నర్సులు, వివిధ స్థాయిల్లో వివిధ రంగాలకు చెందిన సాంకేతిక నిపుణులు ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవ్వాలి.

*అన్నీ సౌకర్యాలతో ఆసుపత్రులు, లాబరెటోరీస్, మందుల షాపులు ఇలా ఒకటేమిటీ అన్నీ ఏర్పాట్లు చేయాలి.

primary health centre కోసం చిత్ర ఫలితం

ఇలా ఈ రెండురంగాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగల ప్రభుత్వానికి ఎన్నికల ప్రచారం అవసరం రాదు. ఈ రంగాలకు చేసే ఒకటి రెండు బడ్జెట్ కేటాయింపు లు చాలు మౌలిక ఏర్పాట్లకు ఆపై ఆ రంగాలకు ఎవరూ ఏ ప్రభుత్వాలు సేవలు అందించనవసరం లేదు. కొంతకాలం అయిన తరవాత అటు రైతులు జిఎస్టి ఇటు అభాగ్య రోగులు ఆదాయ పన్ను కట్టగల స్థాయికి వస్తారు.  

primary health centre కోసం చిత్ర ఫలితం 

    

మరింత సమాచారం తెలుసుకోండి: