అసలే బీజేపీ, టీడీపీ మధ్య పరిస్థితి ఉప్పు-నిప్పుగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులోనూ ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ ఫోటోను ఎందుకు పెట్టడంలేదని ఎమ్మెల్సీ సోమవీర్రాజు నిలదీశారు.

Image result for modi

బీజేపి పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ పోలింగ్ బూత్ నాయకుల మహా సమ్మెళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆ పార్టీ నాయకులు సోమ వీర్రాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. ఆంధ్రప్రదేశ్ లో రూలింగ్ లేదని.. కేవలం ట్రేడింగ్ మాత్రమే ఉందని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియెజకవర్గంలోనే ఓ పథకం విషయంలో 10 కోట్లకుపైగా అవినీతి జరిగిందన్నారు.

Image result for bjp

టీడీపీ నాయకులు అవినీతికి వారసులంటూ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపైనా పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. మేము నిప్పులాంటి వాళ్లం. మీరు అవినీతికి వారసులు. రాష్ట్రంలో ఓ మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్న వారు మీరు. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే నా అజెండా. నాకు సొంత ఎజెండా లేదు. రాష్ట్రంలో రూలింగ్ లేదు.. ట్రేడింగ్ మాత్రమే జరుగుతోంది. రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని సోమువీర్రాజు నిలదీశారు.

Image result for tdp

రాష్ట్రంలో పరిపాలనకు బదులు వ్యాపారం జరుగుతుందన్నారు. బడ్జెట్ దేశానికి సంబందించినదని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించినది కాదని ఆయన అన్నారు.కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి పనుల్లో ప్రధాని పేరు ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించడం లేదని వాపోయారు. కరెంటు సమస్యలు తీర్చడానికి 5 వేల కోట్ల రూపాయల నిధులు మోదీ ప్రభుత్వం ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని వీర్రాజు గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: