మద్య యువతీ యువకులు ఎక్కువ శాతం ప్రేమించుకోవడం..పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం కామన్ అయ్యింది. అయితే కొంత మంది కాలేజ్ యువత మాత్రం పెళ్లికు ముందు కొంత కాలం డేటింగ్ (సహజీవనం) చేస్తూ ఇష్టమైతే పెళ్లి చేసుకుంటున్నారు..లేదా డ్రాప్ అయిపోతున్నారు.  ఓ వైపు పెద్దలు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.  ఏది ఏమైనా పాశ్చత్యనాగరికత వైపు యువత మొగ్గుచూపడం ఒకంత కలవరానికి గురి చేస్తుంది. అయితే కొంత మంది సహజీవనం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
Image result for unsafe sex
ముఖ్యంగా శృంగార సమయంలో కండోమ్ వాడటం జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. కండోమ్ లేకుండా తనతో శృంగారానికి బలవంతం చేస్తున్నాడని ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు సదరు విద్యార్థి అబిన్ జార్జ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..యూనివర్సిటీలో చదువుకుంటున్న ఓ యువతితో పీజీ స్టూడెంట్ అబిన్ జార్జ్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. 
Image result for unsafe sex
అయితే ఇద్దరూ కలిసి ఆరు నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే ఎప్పుడూ సురక్షిత శృంగారం చేయడం మూలాన ఆ యువతి అడ్డు చెప్పలేదు. కానీ కొద్దిరోజుల క్రితం కండోమ్ లేకుండా శృంగారం చేద్దామంటూ జార్జ్ యువతిని బలవంతం చేశాడు.  దీని వల్ల భవిష్యత్ లో ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పినా వినిపించుకోకుండా బలవంత పెట్టడంతో  యువతి జార్జ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Image result for unsafe sex
పోలీసులు 376, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  అయితే కండోమ్ ఉన్నా, లేకున్నా తేడా ఏంటి.. చేసేది శృంగారమే కదా అని జార్జ్ వాదనకు దిగాడట. ఇద్దరూ సంబంధంలో ఉండటం వల్ల కేసు నమోదు చేయకూడదని తొలుత భావించినా.. అతని తీరు సరిగా లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. 3నెలల శిక్ష పడినట్లు తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: