అక్రమ మైనింగ్‌పై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మైనింగ్ విషయంలో జరుగుతున్న అక్రమాల నివారణకు చర్య లు ప్రారంభించింది. అక్రమ మైనింగ్ రాష్ట్రాలనే కాదు, కేంద్రాన్నీ కుదిపేస్తోంది. అక్రమ మైనింగ్ వార్తలు జాతీయ వార్తా పత్రికలలో సైతం పతాక శీర్షికలవుతున్నాయి. ఆ మద్య గోవాలో జరిగిన మైనింగ్ కుంభకోణం దెబ్బకు అక్క డి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. పేలుళ్ల నుంచి ఆయా పదార్థాల కొనుగోలు, రవాణా, నిల్వల వరకు అన్నీ నిబంధనలకు విరుద్ధంగానే సాగుతున్నాయి. క్వారీయింగ్‌ సమీప ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి.
Image result for మైనింగ్‌ పర్యావరణం
ప్రమాదకరమైన పేలుళ్ల గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. జిల్లాలో క్వారీలు ఎన్ని ఉన్నాయి.. లైసెన్స్‌డ్‌ బ్లాస్టర్లు ఎందరు ఉన్నారు.  పర్యావరణం, భూ సేకరణ, పునరావాసం తదితర సమస్యలు మైనింగ్‌ను చుట్టుముట్టుతున్నాయి. తాజాగా గోవాలోని మైనింగ్‌ కంపెనీలకు సుప్రీంకోర్టు భారీ షాక్‌ఇచ్చింది. గోవాలో అన్ని ఖనిజాల తవ్వకాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. పర్యావరణ ఉల్లంఘనల నేపథ్యంలో ఇనుప ఖనిజం గనుల లీజును రద్దు చేస్తూ బుధవారం తీర్పునిచ్చింది.  అంతే కాదు ఇక ముందు కొత్త లీజు పొందాలంటే.. ఎన్విరాన్మెంట్ క్లియరెన్సు తప్పకుండా పొందాలని సూచించింది. 
Image result for మైనింగ్‌ పర్యావరణం
 మార్చి 15 నుంచి లీజింగ్‌ ఆపరేషన్లు నిలిపివేయాలని  ఆదేశించింది.  అలాగే  తాజా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని  కేంద్రాన్నికోరింది.  గోవా ఫౌండేషన్‌ (ఎన్‌జీవో) దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన  సుప్రీం తాజా ఆదేశాలిచ్చింది. జస్టిస్‌ మదన్‌ బి. లో​కూర్‌, జస్టిస​ దీపక్‌  గుప్త ఆధ్వర్యంలోని   సుప్రీం బెంచ్‌  గనుల  తవ్వకంపై  రెన్యువల్‌ రెండవ దశలో గోవా ప్రభుత్వం అనుమతినిచ్చిన   లైసెన్సులను అన్నింటిని రద్దు చేసింది.   
Image result for మైనింగ్‌ పర్యావరణం
ఈ క్రమంలో దాదాపు 88 మైనింగ్ కంపెనీల లీజు సుప్రీం రద్దు చేసింది.  అంతే కాదు మార్చి 16 నుంచి మైనింగ్‌ చేయడానికి వీల్లేదని మైనింగ్‌ కంపెనీలను అందేశించింది. కాగా, గనుల లీజుల ఆలస్యంతో  రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టాన్ని కలిగించారనే ఆరోపణలతో ఇటీవల గోవా  మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు దిగంబర కామత్‌పై  గోవా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: