ప్రశాంతమైన జీవితం, పనికి తగ్గ ప్రతిఫలంగా లభించే సంపాదన, యోగ్యతకు గుర్తింపు ప్రజల వలసలకు దారితీస్తుంది. ఈ విషయం లో భారత్ నుండీ ప్రతి సంవత్సరం వేలల్లో జీవితంపై ఆశ కలవారు సంపన్నులు విదేశాలకు వలస పోతున్నారు.  సాధారణంగా పేదవారు పొట్టచేత పట్టుకుని జీవనం కోసం వలస పోవడం మనం చూస్తూనే ఉన్నాం. వారి వలసలకు జీవన పోరాటం ఒక కారణం. అయితే, వలసలు నిరుపేదలకు మాత్రమే పరిమితం కాదు. కోటీశ్వరులు సంపన్నులు కూడా తమ అవసరాల కోసం, ఆశయాల కోసం, మెరుగైన జీవనం కోసం వలసల బాట పడుతున్నారు.
migration of millianors across the globe కోసం చిత్ర ఫలితం

విదేశాలకు తమదైన గమ్యం చేరుకోవటానికి వలస వెళుతూ ఉంటారు.  2017లో మన దేశం నుంచి 7,000 మంది మిలియనియర్లు (అధిక విలువ కలిగిన వ్యక్తులు/మిలియన్‌ డాలర్లు/రూ.6.4 కోట్లు ఆపై సంపద ఉన్నవారు) విదేశాలకు వలసపోయారని "న్యూవరల్డ్‌ వెల్త్‌ రిపోర్ట్‌" చెబుతోంది. 2016 లో వలస వెళ్లిన వారి సంఖ్య కంటే 16 శాతం అధికం. 2016 లో 6,000 మంది, 2015 లో 4,000 మంది మిలియనియర్లు లేదా కోటీశ్వరులు మన దేశం నుంచి విదేశాలకు తమ గమ్యాన్ని నిర్దేశించుకుంటూ వస్తున్నారు. అమెరికా, అరబ్ ఎమిరెట్స్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జర్మని స్విట్జర్లాండ్ మనదేశవాసులను ఆకర్షించిన ఆశాసౌధాలు. 
  
ప్రపంచ వ్యాప్తంగా సంపన్నుల వలసలకు కారణమైన కీలక విషయాలు: 

migration of millianors across the globe కోసం చిత్ర ఫలితం

@ 2017లో 10,000 మంది మిలియనియర్లు ఐన చైనీయులు విదేశాలకు ఆ దేశం వీడి వలస వెళ్లారు. వలసల్లో అంతర్జాతీయం గా మొదటి స్థానం చైనాదే. టర్కీ 6,000 మంది, బ్రిటన్‌ 4,000 మంది, ఫ్రాన్స్‌ 4,000 మంది, రష్యా 3,000 మంది సంపన్నులను కోల్పోయాయి. ఈ కోటీశ్వరుల వలసల సంఖ్య 2017లో మొత్తం మీద అంతర్జాతీయంగా 95,000గా ఉంది. 
 

@ కోటీశ్వరులను ఆకర్షించడంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానం దక్కించుకుంది. 2017లో ప్రపంచ దేశాల నుంచి ఈ దేశానికి తరలివెళ్లిన వారు 10,000 మంది ఉన్నారు. అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో రెండోసారి ఆస్ట్రేలియా కంటే వెనుక బడింది. అయితే, మొత్తం మీద కోటీశ్వరుల ఆకర్షణలో ఆస్ట్రేలియా తర్వాత నిలిచింది అగ్రరాజ్యమే. 9,000 మంది ఈ దేశాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత కెనడా 5,000 మంది, యూఏఈ 5,000 మందిని ఆకర్షించాయి.

migration of millianors across the globe కోసం చిత్ర ఫలితం

@ మిలియనియర్ల సంపద అత్యధికంగా వున్న దేశాల్లో భారత్‌ కు ఈ నివేదిక ఆరో స్థానం కల్పించింది. మొత్తం సంపద విలువ 8,230 బిలియన్‌ డాలర్లు.


@ భారత్‌లో 330400 మంది సంపన్నులు (మిలియైయర్లు) ఉన్నారు. మిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్‌ అంతర్జాతీయంగా 9వ స్థానంలో నిలిచింది. మల్టీ మిలియనీర్లు 20,730 మంది ఉన్నారు. ఈ విషయంలో ఏడో స్థానంలో ఉంది. 119 మంది బిలియ నీర్ల (100 కోట్ల డాలర్లు, అంతకు పైన సంపద ఉన్నవారు)తో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో నిలిచింది.

migration of millianors across the globe కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: