తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ పెట్టారు. ప్రజల తరుపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వస్తున్న అంటూ..ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.  ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆయన కొంత కాలం నుంచి పోరాడుతున్నారు. ఇక బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆ మద్య తన ఫేస్ బుక్ లో పవన్ కళ్యాన్ రాజకీయాలకు పనికిరాడు అని కామెంట్ పెట్టారు.
Image result for andhrapradesh band
దాంతో పవన్ ఫ్యాన్స్ మనోడితో  ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు.  నాలుగు నెలలు గా ప్రతిరోజు మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్ రగడకు పులిస్టాప్ పడింది.  కత్తిపై పవన్ ఫ్యాన్స్ కోడిగుడ్ల దాడి..తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకుండా వెనక్కి తగ్గడం..జనసేన కార్యకర్తలో కత్తి ఫోటో దిగడం అన్నీ అయ్యాయి.
Image result for andhrapradesh band
  తాజాగా కత్తి మహేష్ యూ టర్న్ తీసుకొని జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి.  తాజాగా ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం నేను పోరాడుతానని ముందుకొచ్చారు సినిమా క్రిటిక్ కత్తి మహేష్. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ జరుగుతున్న బంద్‌కు ఆయన మద్దతు పలికారు. విజయవాడలో వామపక్షాలు, జనసేన చేస్తున్న ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
kathi
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ రాష్ట్రం పోరాటం చేస్తానంటే ఆయనతోపాటు ఉద్యమంలోకి రావడానికి తానూ సిద్ధమేనని ప్రకటించారు.  ఏపీ బంద్ కి పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించడం అభినందనీయమని.. ఆయన ప్రజల్లోకి రావాలని కోరారు. పవన్ రాష్ట్రం పోరాటం చేస్తానంటే ఆయనతోపాటు ఉద్యమంలోకి రావడానికి తానూ సిద్ధమేనని ప్రకటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: