ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ఎంపీలు ఎవ‌రికి వారుగా కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కాంగ్రెస్ నేత‌లు సైతం ప్ల‌కార్డులు ప‌ట్టుకుని ఢిల్లీలో ఉద్య‌మ వేడి ర‌గిలించారు. వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు ఇలా పార్టీ ఏదైనా అజెండా ఒక్క‌టే అనే రీతిలో ఎంపీలు కేంద్రంపై విరుచుకుప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలోనే ఏపీకి చెందిన ఓ ఎంపీ పార్ల‌మెంటులో మౌనంగా ఉండ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇంత‌గా మేం ఓట్లేసి గెలిపిస్తే.. క‌నీసం రాష్ట్రం కోసం ఒక్క మాటైనా మాట్లాడ‌వా? అంటూ స‌దరు ఎంపీని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు.
Image result for tdp mps parliament
ఆ ఎంపీ ఫొటో పెట్టి మ‌రీ ఫేస్‌బుక్ స‌హా సోషల్ మాధ్య‌మాల్లో క‌డిగిపారేస్తున్నారు. దీంతో ఆ ఎంపీ ఎట్ట‌కేల‌కు స్పందించారు. అయితే, రివ‌ర్స్ గేర్‌లో త‌ను ఎందుకు మౌనంగా ఉంటోందో చెప్ప‌కుండా ఎదురు దాడికి తిగింది. ఆ ఎంపీ ఎవ‌రో కాదు,.. 2014లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి గెలిచిన మాజీ ఆర్డీవో కొత్త‌ప‌ల్లి గీత‌. అయితే, ఎన్నిక‌ల అనంత‌రం ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి టీడీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నించినా.. ఆమె ఆశ‌లు ఫ‌లించ‌లేదు. దీంతో ఆమె అటు వైసీపీలోను, ఇటు టీడీపీలోనూ లేకుండా ఎంపీగా మాత్రం ఉన్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె కూడా ఏపీ స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు.
Related image
కానీ, ఎలాంటి స్పంద‌నా లేక‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన గీత‌.. గీత ప‌లుకులు ప‌లికింది. స‌ద‌రు విమర్శలపై ఆమె ఘాటుగా స్పందించింది.తాను నిరసనలో నిలబడలేదని అనేవారు తానడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. కేంద్రం ఇచ్చే నిధులకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని ఆమె ప్రశ్నించింది. బీజేపీతో టీడీపీ కలిసున్నా రాని హోదా... వైసీపీ కలిస్తే ఎలా వస్తుందని ఎంపీ ప్రశ్నించింది.హోదా ఇస్తే బీజేపీతో కలుస్తామని జగన్ ఎలా అంటారని నిలదీసింది. జగన్ కేంద్రాన్ని వదిలి టీడీపీనే ఎందుకు తిడుతున్నారని కూడా ఆమె అన‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.
Image result for tdp mps parliament
 చిత్తశుద్ధి ఉంటే అందరూ కలిసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని  గీత సూచించింది.  ఈ వ్యాఖ్య‌ల‌తో అటు టీడీపీ ఇటు వైసీపీ నేత‌లు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. గీత ప‌లుకులు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్నాయ‌ని వైసీపీ నేత‌లు ఇప్ప‌టికే కౌంట‌ర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అసలు నువ్వు ఏపార్టీలో ఉన్నావో చెప్పి.. ఆ త‌ర్వాత కామెంట్లు కుమ్మ‌రించ‌మ్మా? అంటూ ప్ర‌శ్న‌లు సంధించారు. అంతేకాదు, అర‌కు ప్ర‌జ‌ల‌కు ఇదే స‌మాధానం చెబుతావా? అంటూ నిల‌దీశారు. నిజ‌మే క‌దా?!



మరింత సమాచారం తెలుసుకోండి: