ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికార టీడీపీ టిఆరెసులు అనేక ప్రలోభాలకు గురిచేసి కొనటం ఉభయ రాష్ట్రాల ప్రజలకు తెలుసు. తెలంగాణాలో ఈ ప్రజాప్రతినిధుల కొనగోలు వ్యాపారంలో ఓటుకు నోటు కేసు ద్వారా ఈ ఉభయ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నారని వారికి డబ్బు ఆశచూపి వారిని అనైతికం గా టిడిపి కొనేస్తుందని ఈ "ఓటుకు నోటు కేసు"ద్వారా తెలుగు జనావళికి బాగా తెలిసిపోయింది. జనం నాడు ఈ ఎమ్మెల్యేలు సంతలో గొర్రెలు ఒకటేనని ఈ రెండింటికి పెద్ద తేడాలేదని జనానికి తేటతెల్లమైంది.

Image result for vote for cash scam

అంతేకాకుండా భారత రాజ్యాంగ పదవి అదీ ప్రతిష్ఠాత్మక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు స్వయానా ఈ స్థాయికి దిగజారటం భారత దేశమంతా గుర్తించింది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఒక్క క్షణం కూదా కొనసాగటానికి ఏమాత్రం అర్హుడు కాదని విశ్లేషకులు భావించారు. తెలుగుదేశం పార్టి తమ అధినేత ఆద్వర్యంలో  తమ ఎమ్మెల్యె లను కొనగోలు చేస్తోందని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసిపి ఫిర్యాదు చేసింది. వైసిపి పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓ.పీ. రావత్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. పిర్యాదు చేసిన అనంతరం ఆయన ప్రెస్ తో మాట్లాడుతూ 

Image result for ycp mlas to join tdp

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ, ఆ సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటోందని ఆరో పించారు. వైసిపి ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోందని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేయాలని కుట్ర పన్నుతోందని వెల్లడించారు"

Image result for vijayasai reddy with cec op ravat 

విజయసాయి మాట్లా డుతూ "మా పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మందిని రూ. 10 నుంచి 20 కోట్లు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగతా 44 మందిలో కనీసం నలుగుర్ని కొనాలని ప్రయత్నిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు ₹ 25 కోట్లు ఆఫర్‌ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. రాజ్యసభ ఎన్నికల సమయంలో పోలింగ్‌ బూత్‌ లను ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ లో పెట్టాలని, కేంద్ర బలగాలతో ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని కోరాం. తప్పుడు కేసులు పెట్టకుండా చూడాలని, ప్రత్యేక పరిశీలకుడిని నియ మించి ఎన్నికలను పర్యవేక్షించాలని విజ్ఞప్తిచేశాం. గతంలో తెలంగాణలో 'ఓటుకు నోటు కేసు' లో చంద్ర బాబు ఇరుకున్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చట్టవ్యతిరేఖ కార్య కలాపాలపై కేంద్రం 'నిఘా' పెట్టాలని కోరామని" విజయసాయిరెడ్డి తెలిపారు.

వైసిపి పార్లమెంట్ సభ్యుడైన విజయసాయిరెడ్ది సిఈసి ఓపి రావత్ కు సమర్పించిన పిర్యాదు లేఖను క్రింద పొందుపరచటం జరిగింది.

Image result for vijayasai reddy with cec op ravat




మరింత సమాచారం తెలుసుకోండి: