ఈ మద్య తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.  నల్లగొండలో కాంగ్రెస్ లీడర్ బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది.  ఎమ్మెల్యే కోమటి రెడ్డి శ్రీనివాస్ ది ముమ్మాటికి రాజకీయ హత్య అని..ఇందులో టీఆర్ఎస్ జోక్యం ఉందని ఆరోపిస్తున్నారు.  మరోవైపు ప్రభుత్వం చేసే అభివృద్ది పనులు చూసి ఓర్వలేకనే అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని..దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోండి అంటూ టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సభ్యులకు సవాల్ విసురుతున్నారు.
Image result for trs
తాజాగా ‘కాంగ్రెస్’ పై, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై  మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్’ని లోఫర్ పార్టీగా పేర్కొన్న కేటీఆర్ వ్యాఖ్యలపైనే కాదు, టీఆర్ఎస్ ను బ్రోకర్ పార్టీ గా ఎవరైనా అభివర్ణించినా  తాను ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని అన్నారు.  విభ‌జ‌న హామీల‌ను కేంద్రం నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. హామీల అమ‌లుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుంటే .. తాము స‌హ‌కరిస్తామ‌ని చెప్పారు.
Image result for congress
అయితే ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవడంలేదో వాళ్లకే తెలియాలన్నారు. ప్రభుత్వానికి సమస్యలు చెప్పడమంటే గోడకు చెప్పినట్టే అన్న జానారెడ్డి.. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మాట్లాడిన విధానం సరిగా లేదన్నారు. టీఆర్ఎస్ నేతల వలె తాము కూడా వ్యాఖ్యలు చేయగలం గానీ, అందుకు, తమ సభ్యత, సంస్కారం అడ్డొస్తోందని అన్నారు.
Image result for janareddy
ఎదుటి వారిని చులకన చేసి తాము గొప్పవాళ్లమవుతామని అనుకోవడం సరికాదని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు.  పరుష పదజాలం వాడటం వల్ల రాజకీయనాయకులు ప్రజల్లో చులకనవుతారని, వారిపై గౌరవం తగ్గుతుందని, పత్రికలు కూడా ఇలాంటి పదాలను రాయొద్దని ఈ సందర్భంగా జానారెడ్డి సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: