"డెత్ సర్టిఫికెట్ చూడకుండా మరణవార్తను ప్రచురించదని హిందూపత్రికపై మా చిన్నతనంలో జనాల్లో ఒక అభిప్రాయ ముంది" అది నిజం కాకపోయినా  దానిలో ఒక వార్త ప్రచురింపబడితే దానిపై 100% విశ్వసనీయత జనావళిలో ఉందేదనిఅర్ధం. ఒక వార్త ప్రచురిస్తే దానిలోని విషయం యదార్ధమేనని ఆ వార్త ప్రచురించిన పత్రికను బట్టి జనం విశ్వసించేవారు. 


అంతెందుకు గతం లో ప్రభుత్వం బాంకులకు అర్ధాంతరంగా సెలవు ప్రకటిస్తే అది ఈనాడులో వస్తెనే నమ్మేవాళ్ళం. అంత వరకూ వేరే పత్రికల్లో ఆ వార్త ప్రచురించబడ్డా నమ్మేవాళ్ళం కాదు. కాని కాలం మారింది. నీతి నిజాయతీ, ఋజు వర్తనకు చెల్లు చీటీ ఇచ్చాయి కొన్ని తెలుగు పత్రికలు. చాలా కాలం నుండి పత్రిక యాజమాన్యం ఏ వర్గా నికి ఏ పార్టీకి చెందిన వారు అని చూసు కొని ఆ వార్తను నమ్మాలా? వద్ధా? అనేది నిర్ణయించుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.

Related image

     
కేసులో నేరస్థులుగా ఋజువైన ఎల్.నారాయణ చౌదరి కి కొమ్ముకాసి వార్తలు రాసిన ఆంధ్ర జ్యోతి పత్రిక విశ్వసనీయత మురికి కంపు కొడుతుంది. ఈ పత్రిక ఎల్లవేళలా ఒక వర్గానికే కొమ్ముకాస్తూ వార్తలు రాస్తున్ దనటానికి అనంతపురం జిల్లా కోర్టు తీర్పే ఒక ఋజువు. ఒకవైపు పరిటాల వర్గాన్ని మరోవైపు ఎల్.నారాయణ చౌదరిని వెనకేసుకొచ్చి న్యాయస్థానంలో అభాసుపాలైన ఆంధ్ర జ్యోతి తీరు అన్నింటా ప్రశ్నార్ధకమే అని మరోసారి ఋజువైంది. ఇక ఇది పచ్చపత్రిక అని చెప్పటానికి ఇంతకంటే ఋజువు అవసరం లేదు. అసలు విషయంలోకి వస్తే: 


వైసిపి నేత ప్రకాష్ రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో పరిటాల వర్గానికి "భారీ ఝలక్" తగిలింది. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని, పరిటాల వర్గం లోని ముఖ్య వ్యక్తి అయిన ఎల్.నారాయణ చౌదరి, ఆంధ్రజ్యోతి పత్రిక లపై ప్రకాష్ రెడ్డి దాఖలు చేసిన దరకాస్తు పై అనంతపురం జిల్ల న్యాయస్థానం పిటీషనరు పిర్యాదు ను అంగీకరిస్తూ పరిటాల వర్గానికి చెందిన ఎల్.నారాయణ ను ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలలోని విశ్వసనీయతపై ఆసక్తిదాయకమైన తీర్పు యిచ్చింది.


Related image

ప్రకాష్ రెడ్డి పై టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన కోర్టు, ఏకంగా "పది లక్షల రూపాయల జరిమానా" విధించింది. అలాగే ఈ కేసులో, "ఆంధ్ర జ్యోతి పత్రికకు కూడా లక్ష రూపాయల జరిమానా" విధించింది అనంతపురం జిల్లా కోర్టు. ఈ మేరకు శుక్రవారం తీర్పు నిచ్చింది. ఇది ఏడుసంవత్సరాల కింద దాఖలైన పిటిషన్. జూబ్లీహిల్స్ కారుబాంబుకేసులో, వైసిపి రాప్తాడు  నియోజకవర్గం సమన్వయ కర్త అయిన తనకు సంబంధం ఉందని నారాయణ చౌదరి వ్యాఖ్యానించారని, అవి అబద్ధపు మాటలు అని ప్రకాష్ రెడ్డి కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ అనుచితమైన మాటలపై చర్యలు తీసుకోవాలని, పరువు నష్టం దావాను దాఖలు చేశారాయన.


అలాగే ఆంధ్రజ్యోతి పత్రికపై కూడా పరువునష్టందావావేశారు.దీనిపై విచారణ జరిపిన కోర్టు, టీడీపీనేత, పరిటాలఅనుచరుడు  అయిన నారాయణ చౌదరివి అసంబద్ధమైన ఆరోపణలుగా తేల్చింది. కారుబాంబ్ కేసులో ప్రకాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రకాష్ రెడ్డి పరువుకు భంగం కలిగించేలా మాట్లాడినందుకు చౌదరికి, అలాగే తప్పుడు రాతలు రాసి నందుకు ఆంధ్రజ్యోతి పత్రికకు జరిమానా విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: