ఓటుకు నోటు వ్యవహారం చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఓ మచ్చలాంటిది. ఇప్పుడు వైసీపీ దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో త్వరలో రాజ్యసభ ఎన్నిక జరగబోతోంది. వైసీపీ నుంచి ఇప్పటికే భారీగా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన నేపథ్యంలో ఆ  సీటును టీడీపీ గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఓటుకు నోటు వ్యవహారాన్ని బయటకు తీస్తోంది. 

vijaya sai reddy election commission కోసం చిత్ర ఫలితం
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపి రావత్ ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రానున్న రాజ్యసభలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ కి ఒక రేప్రెజెంటేషన్ ఇచ్చారు. 
రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతి కి పాల్పడుతోందని..  శాంతిభద్రతలు కరవయ్యాయని అందులో పేర్కొన్నారు. వైసీపీకి చెందిన 63 మంది ఎమ్మెల్యేల్లో 23 ఎమ్మెల్యేలను తెదేపా ఇప్పటికే కొనేసిందని ఆయన రావత్ కు వివరించారు. 


వైసీపీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కొరిని 10 నుంచి 20 కోట్లకు తెదేపా కొనుగోలు చేసిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం వైకాపా కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో మరో 4 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విషయాన్ని సీఈసీకి వివరించాను.. సీఈసీ ఈ వ్యవహారంపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశాను.. ఆంధ్రప్రదేశ్ లో తెదేపా సర్కారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తోందని ఫిర్యాదు చేసినట్టు విజయసాయి తెలిపారు. 



గతంలో టీడీపీ తెలంగాణలో ఓటుకి నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కున్న విషయాన్ని రావత్ కు విజయసాయి వివరించారు. అలాగే ఇప్పుడు ఏపీలో కూడా సీఈసీ నిఘా పెట్టాలి.. వైసీపీ నుంచి తెదేపాలోకి పోయిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు ఇచ్చాము.. కానీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తెదేపా తొత్తులా తయారయ్యారని విజయసాయి సీఈసీకి ఫిర్యాదు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: