ఇన్నాళ్లూ కేంద్రం రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటోందని.. కేంద్రం నుంచి నిధులు సాధిస్తున్నామని గొప్పలు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అనుకోకుండా యూ టర్న్ తీసుకున్నారు. కేంద్రం ఏపీని దగా చేస్తోందని.. తమ ఎంపీలతో కేంద్రంపై యుద్ధం చేయిస్తున్నారు. ఇదే చంద్రబాబు గతంలో ప్రత్యేక హోదా వద్దని.. ప్రత్యేక ప్యాకేజీయే ముద్దని వందల సార్లు మీడియా ముందే నొక్కి వక్కాణించారు. 

ap bandh కోసం చిత్ర ఫలితం

కానీ ఇటీవలి కాలంలో చంద్రబాబు తీవ్ర గందరగోళంలో ఉన్నట్టు అర్థమవుతోంది. బీజేపీతో వెళ్తే లాభం లేదనుకున్నారో ఏమో.. ఒక్కసారిగా గందరగోళంలో పడిపోయారు. బీజేపీని వదల్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఆంద్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిందని నెత్తీనోరు మొత్తుకునే చంద్రబాబునాయుడు ఒక వైపు విపక్షాలు ఈ విషయాన్ని సమర్ధిస్తూ బంద్ పిలుపు ఇస్తే తమకు సంబంధం లేదన్నట్టు దుబాయ్ వెళ్ళిపోయారు.



సరే తనది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని అనుకుందాం. కానీ అందులో తెలుగుదేశం శ్రేణుల్ని అయినా చొప్పించారా అంటే అదీ లేదు. అక్కడ ఆత్మాభిమానం అడ్డొచ్చింది. తమ ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా రోడ్లపై ఎక్కి ధర్నాలు చేయండని ఆదేశించి నిరసనకు కొత్త మార్గాన్ని సూచించారు. అది విపక్షాలు చేస్తున్న బంద్లో భాగమై పోయింది. తమ పార్టీ శ్రేణులు రోడ్లపై ఎక్కడా కనిపించకపోయే సరికి దుబాయ్ నుంచి ఆరా తీసిన ఆయనకు ఏం చేయాలో అర్ధం కాలేదు. అసలు నిరసన కార్యక్రమంపై తెలుగుదేశం శ్రేణుల్లోనే ఓ క్లారిటీ లేదనడానికి ప్రత్యక్ష నిదర్శనం. 

ap bandh కోసం చిత్ర ఫలితం
తాము బందుకు దూరమని, జనజీవితాన్ని స్తంభింపజేయడం ఇష్టం లేకే తాము బందుకు దూరంగా ఉన్నామని కొందరు మంత్రులు చెప్పారు. ఇదే విషయమై టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తాము బందులో పాల్గొన్నాము కాబట్టే అది సక్సెస్ అయ్యిందని వక్కాణించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద పార్టీ, అనుభవమున్న నేతలు ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఇలా ఉంటే కేంద్రాన్ని నిందించి ప్రయోజనం ఏమిటి? తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను నీటి మీద రాతలుగా భావిస్తున్న భారతీయ జనతాపార్టీని చుట్టచుట్టి గంగలో పారేయడం తెలుగు ప్రజలకు తెలుసు. బీజేపీ అన్ని ఇస్తున్నట్టు నాటకాలాడి మరో యేడాదిలోగా ఎన్నికలున్న వేళ తెలుగుదేశం పార్టీ ఆడుతున్న ఈ డ్రామాను ఏమనాలి? 



మరింత సమాచారం తెలుసుకోండి: