రాష్ట్రం విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయం చూస్తుంటే ఏపీ దేశంలో భాగంగా కాదా అనిపిస్తుంది.. గుండె రగిలిపోతోంది.. రక్తం మరిగిపోతోంది.. ఇదీ ఇటీవలి కాలంలో చంద్రబాబు మీడియా ముందుకు రాకుండా లీకుల ద్వారా వినిపిస్తున్న అసంతృప్తి స్వరం. బాగానే ఉంది. రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్న అన్యాయంపై ఆయన ఆగ్రహంలో అర్థం ఉంది. ఏపీ వాసులంతా అలాగే ఫీలవుతున్నారు. 


కానీ ఇదే చంద్రబాబు గత నాలుగేళ్లుగా ఏపీకి హామీల విషయంపై నిద్రపోతున్నారా అన్న అనుమానం కలుగకమానదు. అంతే కాదు.. ఈ నాలుగేళ్లలో ఆయన ఎన్నోసార్లు కేంద్రం వైఖరిని బ్రహ్మాండం అంటూ పొగిడేశారు. అందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం.. 2016 సెప్టెంబర్ పదో తారీఖున.. హోదాకు సమానంగా కేంద్రం ఇస్తామంటున్న నిధులు తీసుకోవద్దా? పోలవరం వద్దా అంటూ ఆయన ఘీంకరించారు. దెబ్బలు తగిలిన చోటే ప్రతిపక్షం కారం చల్లుతోందని అన్నారు.



అప్పుడు ప్రతిపక్షం చేస్తున్న బంద్‌కు సహకరించవద్దని ప్రజలను కోరుతున్నానన్నారు. ఆ మరుసటి రోజే.. కేంద్రం చెప్పినదానికన్నా అదనంగా ఏం వస్తాయో చెప్పండని నిలదీశారు. హోదా ఇచ్చినా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు.. పరిశ్రమలు రావాలంటున్నారు..  వస్తున్న వాటిని వ్యతిరేకిస్తున్నారు.. అంటూ వైసీపీపై నిప్పులు చెరిగారు ఇదే చంద్రబాబు. అంతెందుకు 2017 జనవరి 26 ప్రసంగంలో ఆయన ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 

CHANDRABABU ON MODI కోసం చిత్ర ఫలితం
కేంద్రం నుంచి మనమే ఎక్కువ నిధులు సాధించుకున్నాం.. వేరే ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా.? ఆధారాలుంటే చెప్పండి..  ప్రత్యేక హోదాతో సమానమైనవన్నీ వచ్చేశాయని.. ముఖ్యమంత్రి ప్రసంగించారు కూడా. నిరుడు మార్చి 16న కేంద్రంతో సయోధ్య కారణంగానే ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని చంకలు గుద్దుకున్నారు. ఆ మరుసటి రోజు ప్రధానికి కృతజ్ఞతలు చెబుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు కేంద్రం రాష్ట్రాన్ని నిలువునా ముంచిందని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: