గత ఎన్నికలలో మిత్రపక్ష పార్టీలుగా ఎలక్షన్ బరిలోకి దిగి విజయం సాధించిన టిడిపి-బిజెపి పార్టీలు, ప్రస్తుత రాజకీయ పరిణామాల వల్ల రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే లా ఉంది. తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపించడం వల్ల తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ మీద ఉభయ సభలలో ఆందోళనలు నిరసనలు చేపడుతోంది. అయితే ఈ  క్రమంలో కేంద్రం రాష్ట్రం మధ్య సయోధ్య కుదర్చడానికి భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు.


గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం టిడిపి బిజెపి భందం తెగిపోకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే వెంకయ్య టిడిపి నేతలతో కొన్ని కీలక విషయాలు చెప్పారు..మీకు ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఎప్పటికీ బీజేపి భందాన్ని వదులుకోవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతము రెండు పార్టీల మధ్య భందం తెగిపోకుండా ఉండేలా ఆయన జోక్యం చేసుకుని కేంద్ర మంత్రి జైట్లీ తో అమిత్ షా లతో ఏపీ అంశాలు చర్చించారని సమాచారం.


అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఎంపీలను పిలిచి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్లాస్ తిసుకునారట రాజీనామాలు చేస్తామని ఎగిరెగిరి పడుతు న్నారు మీరు, చేసే రాజీనామాల వల్ల రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం ఉండదని తేల్చిచెప్పారు.


ఏదేమైనా ఓపికతో ఉండి కేంద్రంతో పనిచేయించుకోవాలని అన్నారు వెంకయ్యనాయుడు. కేంద్రం మీద తిరగబడితే రాష్ట్ర ముఖ్యమంత్రికే  నష్టమని సలహాలు ఇచ్చారు వెంకయ్యనాయుడు. నా మాట విని బీజేపీతో రాజీపడండి చేస్తున్న నిరసనలు ఆందోళనలు ఆపండి అంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలకు హితవు పలికారు వెంకయ్యనాయుడు.  




మరింత సమాచారం తెలుసుకోండి: