జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి టిడిపి అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈసారి వచ్చే ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా ఎలక్షన్లలో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ పలు సభలలో చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీలోకి రావడానికి ఎన్నికలలో పోటీ చేయడానికి సినిమా రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు క్యూ కడుతున్నారు.


అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్పిన చేయడానికి సిద్దం అంటూ సంపూర్నేష్ బాబు ముందుగా ప్రకటించారు..అయితే ఆ తరువాత బిగ్ బాస్ ఫైనల్ విజేత హీరో శివ బాలాజీ..కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి అడుగులు వేయడానికి నేను సిద్దం..పవన్ కళ్యాణ్ మా అన్నయ్య అంటూ జనసేనకి జై కొట్టారు.అంతేకాకుండా హీరో శ్రీకాంత్ కూడా జనసేన పార్టీ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇదిలావుంటే సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు అన్నయ్య నరేష్ కూడా జనసేన పార్టీ తో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల తెలియజేయడం జరిగింది.


అంతేకాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల జల్లు కురిపించారు నరేష్.ఇక మరో హాస్య నటుడు అలీ..అలీ జనసేనలోకి వస్తాడు రాజమండ్రి నుంచీ పోటీ చేస్తారు అని అప్పట్లో ఫుల్ టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు తాజగా మరో అగ్ర హాస్యనటుడు “బ్రహ్మానందం” జనసేనలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాలలో చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలలో రావడానికి బ్రహ్మానందం ఆసక్తి చూపిస్తున్నారట. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలలో అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నారన్నారు అని టాక్.


పశ్చిమగోదావరి జిల్లాకు కమెడియన్ బ్రహ్మానందంకు  అవినాభావ సంబంధం ఉంది. గతంలో పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో బ్రహ్మానందం సుమారు 9 ఏళ్ళు లెక్చరర్ గా పనిచేశారు. అంతేకాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి కోస్తా జిల్లాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ. గత ఎన్నికలో గమనిస్తే దాదాపు కోస్తా జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది...పవన్ కళ్యాణ్ టీడీపీ కి మద్దతిచ్చిన నేపథ్యంలో. ఇటువంటప్పుడు కోస్త జిల్లా రాజకీయాలలో జనసేన పార్టీ తరఫున రాజకీయాల్లోకి వస్తానంటున్న బ్రహ్మానందం ఎక్కడ నిలబడి పోటీ చేస్తారో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: