ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రా, తెలంగాణా విడదీసే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో హామీలు ఆ చట్టంలో ఇచ్చారు. ఏపీ రాజధానికి కోల్పోతుంది కాబట్టి అందుకు పరిహారంగా ఏపీకి ఎన్నోవిధాలా సాయపడాలని అందులో పేర్కొన్నారు. అవన్నీ సరిగ్గా అమలు చేస్తే ఏపీకి ఏ ఇబ్బందీ ఉండదు. కానీ నాలుగేళ్లయినా ఆ హామీలు ఎందుకు నెరవేరడం లేదు.. అధికారపక్షం బీజేపీతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ జట్టు కట్టినా ఎందుకు హామీలు నెరవేరడం లేదు. 

No automatic alt text available.
ఇందుకు కారణం.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఒక్క పదం. ఒకే ఒక్క పదం.. అవును. విభజన చట్టంలో పేర్కొన్న చాలా అంశములు స్పష్టత లేకుండా ఉన్నాయి. ఈ చట్టం లో మొత్తం 400 సార్ల వరకూ “shall” అనే పదాన్ని ఉపయోగించారట. అంటే చట్టం లో ఉన్న ప్రతీ అంశము కూడా పరిశీలించి చేస్తాము.. పరిశీలించి చేయాలి అనే అర్థం వస్తుంది. అంతే తప్ప.. ఖచ్చితంగా చేస్తామని కానీ.. చేయాల్సిందే అనికానీ అర్థం రాదు. 


అంటే ఆ షల్ అనే ఒక్క పదం వల్ల ఆ హామీలను నెరవేర్చడంలో ఇబ్బందులు వస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ఉన్న ప్రత్యెక దృష్టి తో చట్టం లో ఉన్న చాలా వరకు అంశాలను అమలు చేస్తోందని బీజీపీ నేతలు చెబుతున్నారు. సమస్యాత్మకంగా ఉన్న విషయాల పై చర్చలు జరిపి సాధ్యమైనంత వరకూ మిగిలిన అంశాలను కూడా పూర్తి చేస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 

ap reorganisation act 2014 కోసం చిత్ర ఫలితం

ఈ విషయాన్నీ తెలిసినప్పటికీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఇన్నాళ్లూ సమస్యల పరిష్కారంపై ఒత్తిడి చేయడంలో విఫలమైంది. ఇక ఇప్పుడు ఎన్నికల ముందు తీవ్రస్థాయిలో కేంద్రాన్ని విమర్శిస్తూ వారు చేసిన తప్పులను కప్పిఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా ముందు నుండీ కేంద్రం సహకరం అందించకపోతే, ఇప్పటి వరకు ఏమీ మాట్లాడకుండా ఎందుకు ఉన్నారన్న ప్రశ్నకు టీడీపీ దగ్గర మాత్రం సమాధానం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: