ఆడది అంటే మగాడికి వస్తువు.. మగాడి సొంతం.. ఆమెకంటూ సొంత ఆలోచనలు ఉండకూడదు. సొంత కోరికలు ఉండకూడదు.. ఇదే తరహా ఆలోచన అనాదిగా సాగుతోంది. ఇప్పుడు కాస్త మార్పు వస్తున్నట్టు కనిపిస్తున్నా ఇప్పటికీ ఎన్నో దురాచారాలు మహిళల విషయంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పటి సతీసహగమనం.. ఆ తర్వాత కాలంలో కన్యాశుల్కం, దేవాదాసీ వ్యవస్థ.. మాతంగి ఆచారం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. 

WOMAN SEXUAL DESIRE కోసం చిత్ర ఫలితం
కానీ ఈ కాలంలోనూ కొనసాగుతున్న ఓ దురాచారం గురించి మనం చెప్పుకోవాలి. అదే ఖత్నా. ముస్లిం దేశాల్లో ఈ దురాచారం ఇప్పటికీ కొనసాగుతుంది. మహిళలకు లైంగిక కోరికలు ఎక్కువగా ఉండకూడదు. మగాడికి లైంగిక కోరికలు తీర్చే వస్తువుగా ఆడది ఉండాలి ఆడదానికి లైంగిక కోరికలు ఎక్కువైతే.. సమాజం చెడిపోతుంది. లైంగిక కోర్కెలు తీర్చుకోవడం కోసం మహిళ కట్టుబాట్లను తెంచుకుంటుంది.. ఇలా ఉండేది వారి ఆలోచనా ధోరణి. 

khatna in islam కోసం చిత్ర ఫలితం
మరి ఆడవాళ్లను కట్టడి చేయాలంటే ఏంచేయాలి.. వారిలో లైంగిక కోరికలు పెరగకుండా చూడాలి. అందుకే కొన్ని ముస్లిందేశాల్లో ఖత్నా వంటి ఆచారం ఉంది. ఖత్నా అంటే ఏంచేస్తారు అనేగా మీ సందేహం.. మహిళలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారి జననాంగంలోని కొంత భాగాన్ని కోసేస్తారు. స్త్రీలలో లైంగిక కోరికలను ప్రేరేపించే క్లిటోరస్ అనే భాగాన్ని పాక్షికంగా చిన్నప్పుడే కోసేస్తారు. 

సంబంధిత చిత్రం
ఇలా చేస్తే అమ్మాయిలు పెరిగి పెద్దయినా.. అమ్మాయిలు యుక్త వయస్సుకు వచ్చినా కోరికలు ఎక్కువ లేకుండా ఉంటారన్నది వారి నమ్మకం.. కోరికలు లేకపోతే.. ఇక వారు తమ కట్టడిలోనే ఉంటారని ఇలాంటి దారుణమైన ఆచారాలు పెట్టారు. ఈ దురాచారం ఇంకా కొనసాగడంపై ప్రపంచవ్యాప్తంగా మహిళ సంఘాలు నిరసిస్తున్నాయి. మరి ఈ దురాచారం అంతమయ్యేదెప్పుడో..?



మరింత సమాచారం తెలుసుకోండి: