బీజేపీ జాతీయ అధ్యక్షుడు మోడీ ఎన్నికల వ్యూహకర్త అమిత్ షా మిద ప్రధాని నరేంద్ర మోడీ గుర్రుగా ఉన్నారట. దీనికి కారణం అమిత్ షా తిసుకునే నిర్ణయాలు ఒంటెత్తు పోకడలు, అమిత్ షా సీటుకు ఎసరు పెడుతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాదాపు కొన్ని రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు అమిత్ షా పై గుర్రుగానే ఉన్నాయి. ముఖ్యంగా సంఘ్ ఆధ్యర్యంలో ఉండే బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా అమిత్ షా మిద గుర్రుగా ఉన్నాయట.


అయితే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తీరు పై “సంఘ్‌” తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే సంఘ్ తీసుకునే నిర్ణయాలకి విరుద్దంగా అమిత్ షా ప్రవర్తించడం ఒక విషయం అయితే మోడీ ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది మరొక ఆరోపణ దాంతో “అమిత్ షా” ని తప్పించి సంఘ్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్లే నేతను నియమించాలని భావిస్తున్నారు.


ఈ నేపథ్యంలో మోడీ అత్యంత సన్నిహితుడైన దత్తాత్రేయ హొసబలేకు ఇప్పించాలని మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత సంఘ్ అధినేత మోహన్ భగవత్ ను తప్పించి ఆ స్థానంలో మోడీ సన్నిహితుడు దత్తాత్రేయ హొసబలేను కూర్చోబెట్టాలని మోడీ భావిస్తున్నాడు.


అంతేకాకుండా కేంద్ర మంత్రులు కూడా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మిద అసంతృప్తిగా ఉన్నారట. దీంతో ఇదే విషయాన్ని మోడీకి  చెప్పడంతో ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో మోడీకే విధేయుడిగా ఉండే బిజెపి నాయకుడను బిజెపి జాతీయ అధ్యక్షుడిగా పెట్టాలని మోడీ కూడా భావిస్తున్నారు అని బిజెపి వర్గాల నుండి వస్తున్న సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: