ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది. గత ఎన్నికలలో బిజెపి పార్టీతో జతకట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అభివృద్ధి అంటూ కేంద్రం నుండి వచ్చిన నిధులను దుర్వినియోగ పరిచి కేంద్రం నాకు సహకరించడం లేదు అంటూ కేంద్రంలో ఉన్న బిజెపిని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు.


అయితే ఈ క్రమంలో గత ఎన్నికలలో చంద్రబాబునాయుడుకి  మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ చంద్రబాబునాయుడును కేంద్రం నుండి ఇప్పటిదాకా  వచ్చిన నిధులు లేఖ తెలియజెప్పాలి అని గడువు పెట్టడం జరిగింది. దీంతో తాను చేసిన తప్పును ఇతరుల మీద నెట్టే చంద్రబాబుకు చుక్కలు కనబడుతున్నాయి. అంతేకాకుండా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా మరోసారి ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నయి.


ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీని మార్చి 31లోపు అమలు చేయకపోతే మరోసారి ఉద్యమానికి వెనుకాడనని కాపు ఉద్యమనేత ముద్రగడ తేల్చిచెప్పారు. గతంలో హామీ ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు దీంతో రోడ్డెక్కితే అసెంబ్లీలో తీర్మానం చేశారు చేసిన తీర్మానాన్ని చట్టంలో తేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు చూస్తారు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడను హెచ్చరించారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.


మొన్నటిదాక చంద్రబాబునాయుడు మిద ఆయన ప్రభుత్వం మిద మాట పడనివ్వని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి ఇచ్చిన డెడ్ లైన్ మరియు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఉద్యమ సెగ  మరోసారి రగులుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితి ఉక్కిరిబిక్కిరి అవుతున్నరు అంటున్నారు. ఈ క్రమంలో విపక్ష పార్టీ నాయకులు అనవసరంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: