జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అంటూ జేఏసీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా జెఎసిలో లోక్ సత్తా అదినేత జయప్రకాష్ నారాయణ్ మరియు మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య నేతలుగా ఉంటారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ తాజా నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించింది.


అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులను లెక్క తేల్చాలని పవన్ కళ్యాణ్ తాజాగా స్పష్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వని.


మరియు అదే విధంగా కేంద్రం ఏపీకి చేసిన సాయంపై… విభజన హామీల అమలు తీరుపై జేపీ, ఉండవల్లిల ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 వరకు డెడ్‌లైన్ ఇస్తున్నట్టు ప్రకటించారు.


ఇచ్చిన గడువులోగా రెండు ప్రభుత్వాలు స్పందించకపోతే గత ఎన్నికలలో నేను ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే పరిస్థితి వస్తుందని రెండు  ప్రభుత్వాలకు ఆదేశించారు పవన్ కళ్యాణ్…..గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే.. నేను మద్దతిస్తున్న బీజేపీ టీడీపీ పార్టీలు ప్రజలకోసం సరిగా పనిచేయకపోతే కాలర్ పట్టుకుని అడుగుతాను అని ఆనాడు ప్రజలకు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్. పవన్ తాజా డెడ్ లైన్, వార్నింగ్  తో   రెండు ప్రభుత్వాలు ఆలోచనలోపడ్డాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: