ఎదుటివాళ్లను అవమానించేందుకు అనేక మార్గాలు ఉంటాయి. అందులో ఒక్కొక్కరు ఒక్కో దారిని ఎంచుకుంటారు. ఒకరు మాటలతో అవమానిస్తే... మరొకరు ఏమీ మాట్లాడకుండానే తామనుకున్నది చేసేస్తారు. ఇంతకీ ఇందంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా..? అయితే చదవండిగ.... తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయ‌న్న టాక్ తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిజానికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి వారి మధ్య సత్సంబంధాలు లేవని పలువురు నేతలు చెబుతుంటారు. 

Related image

అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో హరీశ్ రావు కేసీఆర్ తో సమానంగా పాల్గొన్నారు. అనేక జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలను చక్కబెట్టారు. ఓడిపోయే స్థితిలో ఉన్న అనేక అసెంబ్లీ స్థానాల్లో రాత్రింబవళ్లు కష్టపడి పార్టీ అభ్యర్థులనూ ఒంటిచేత్తో గెలిపించారు. నిజానికి ఈ స్థాయిలో కేటీఆర్ పనిచేసినట్లు ఎక్కడా కనిపించదు. అందుకే హరీశ్ రావుకు సరైన గుర్తింపు, సముచిత స్థానం దక్కలేదనే టాక్ ఉంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం లో మంత్రి కేటీఆర్ కు ఉన్నంత పలుకుబడి, గౌరవం మంత్రి హరీశ్ రావుకు లేదనేది బహిరంగ రహస్యమే. కానీ పార్టీలో మాత్రం మొదటి నుంచి కూడా హరీశ్ రావు తనకంటూ ఓ వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు. 

Image result for KTR

ప్రస్తుతం ప్రభుత్వంలో హరీశ్ రావు వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల పనులను కేటీఆర్ పక్కన బెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రి హరీశ్ రావును ఏదోరకంగా అవమానించేందుకు మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సిద్దంగా ఉంటారనే ప్రచారానికి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. డిసెంబర్ నెలలో మంత్రి హరీశ్ రావు కూతురు శారీ ఫంక్షన్ చేశారని, కావాలని మంత్రి కేటీఆర్ ఆ ఫంక్షన్ కు రాకుండా ఫ్యామిలీ తో బెంగళూరుకు వెళ్లి సినిమా చూసొచ్చారని కోమటిరెడ్డి చెప్పడంతో అందరూ ఆశ్చర్య పోయారు. 

Image result for HARISHRAO

కేటీఆర్ రాకుండా దగ్గరి బంధువుల మధ్య హరీశ్ రావును అవమానించారని చెప్పడం అటు అధికార టీఆర్ఎస్ క్యాడర్లో, ఇటు ప్రజల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మంత్రి హరీశ్ రావు ను పొగుడుతూ వెనకేసుకురాడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: