2014 ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయిన జగన్ ఈ సారి మాత్రం ఎటువంటి పరిస్థితులలో ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని గద్దెనెక్కాలనుకుంటున్నాడు. ఇక ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఆయన తన పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్నాడు.


కాగా నేడు సాయంత్రం పాదయాత్రలో ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నాడు. పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతోఆయన ఈ మీటింగులో పాల్గొనబోతున్నట్లుగా ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనను విడుదలచేసింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో వైఎస్‌ ప్రజా సంకల్పయాత్ర శిబిరం వద్ద ఈ సమావేశం జరగనున్నట్లు అందులో పేర్కొన్నారు.


రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం వంటి అంశాలనుద్దేశించి మీటింగులో చర్చించబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. తాము చేస్తున్న ప్రత్యేక హోదా అంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించటంపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు అందులో వివరించారు. కాగా అప్పటిలో బీజేపీతో పొత్తుకు సై అని జగన్ కోరికను బయటపెట్టాడు. బడ్జెట్ కేటాయింపుల తరువాత  బీజేపీకి రాష్ట్రంలో వ్యతిరేఖత వస్తున్న టైములో పార్టీ భవిష్యత్ కార్యాచరణ కోసమే జగన్ మీటింగు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు సమాచారం అందించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: