ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉన్నా నేపథ్యంలో రోజు రోజుకి ఆంధ్రరాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసిపి పార్టీకి అనుకూలంగా గాలివీస్తోంది. ఇదేవిషయం తాజాగా ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ సర్వేలో వెల్లడయ్యింది. అయితే ఈ క్రమంలో జిల్లా రాజకీయాలు కూడా మారిపోతున్నాయి.


గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఒక్క సీటు కూడా గెలవని వైసీపీ పార్టీ….ప్రస్తుతం జిల్లాలో క్రమక్రమంగా బలపడుతుంది. ఈ క్రమంలో చింతలపూడి నియోజకవర్గంలో గత నాలుగు దశాబ్దాలుగా రెండుసార్లు మినహా ఇక్కడ టిడిపి పార్టీ అధికారం కైవసం చేసుకుంది. ఇలాంటప్పుడు కష్టపడవలసినా వైసీపీ పార్టీ నాయకులూ  గ్రూప్ రాజకీయాలతో చింతలపూడి నియోజకవర్గం నిండి ఉంది.


ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న కోట‌గిరి శ్రీథ‌ర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడి మాజీ ఎమ్మెల్యే, ఏపీఐడీసీ చైర్మ‌న్ ఘంటా ముర‌ళీకి శ్రీథ‌ర్ వ‌ర్గానికి కొద్ది రోజులుగా స‌ఖ్య‌త లేదు. అయితే తాజాగా వీరిద్దరూ ఒకరి నొకరు పలకరించుకోవడం జరిగింది.


కొద్ది రోజుల క్రితం పార్టీలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నుంచి ఉన్న ముర‌ళీకి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇవ్వ‌డంతో శ్రీథ‌ర్ వెంట‌నే ముర‌ళీ ఇంటికి వ‌చ్చి క‌లిశారు. వీరిద్దరి కలయిక చింతలపూడి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలకు మంచి ఊపు నిచ్చింది. దీంతో రాబోయే ఎన్నికల లో చింతలపూడి నియోజకవర్గం లో వైసీపీ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: