దేశంలో ఉన్న 31 ముఖ్యమంత్రుల ఆస్తుల గురించి వారి వ్యక్తిగత వివరాలు గురించి ద అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) అనే సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్పించిన అఫిడవిట్లు పరిశీలించి స్పష్టం చేసిన ఫలితాలు ఇవి. దేశం మొత్తంమీద ఉన్న ముఖ్యమంత్రులలో 35% మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి….అంతేకాకుండా ముఖ్యమంత్రుల 81% మంది కోటీశ్వరులు...అని వారు సమర్పించిన అఫిడవిట్లు ద్వారా తెలిసిన సమాచారం.


దేశంలో ఉన్న 31 ముఖ్యమంత్రులలో 11 మందిపై అందుకు క్రిమినల్, చీటింగ్ కేసులు ఉన్నాయి. ఇక్కడ కూడా దేశం మొత్తంమీద 31 మంది ముఖ్యమంత్రులు 25 మంది కోటీశ్వరులు వీరిలో మొదటి స్థానం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది. రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల విలువ 117 కోట్లు.


చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేను అప్పుల్లో కూరుకుపోయి నా ఆస్తి 25 లక్షలు అని చాలాసార్లు చెప్పారు. అయితే ఈ క్రమంలో తాజాగా ఏడీఆర్  వెల్లడించిన లెక్కలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.


కేవలం అఫిడవిట్లో చూపించినవి అధికారిక లెక్కలు మాత్రమే మొత్తంమీద చూసుకుంటే చంద్రబాబు చాలా సంపాదించారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకేనేమో టీడీపీ మిత్రపక్ష పార్టీ బిజెపి నేత సోమువీర్రాజు ఈ మధ్య చంద్రబాబు ఆస్తులు 2 లక్షలు అని ఆరోపించడం. ఏదిఏమైనా చంద్రబాబు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఏమో గాని ఆయన మాటికీ బాగా అభివృద్ధి అయ్యారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: