ఏపీ సీఎం చంద్రబాబుకు హైటెక్ సీఎంగా మంచి పేరు ఉంది. టెక్నాలజీని బాగా ఉపయోగిస్తారని.. అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారని పేరు ఉంది. తొమ్మిదేళ్లకుపైగా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉన్నారు. ఈ టెర్మ్ తో ఆయన దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు అవుతుంది. మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. ఆ టెర్మ్ కూడా పూర్తి చేసుకుంటే 19 ఏళ్ల రికార్డు ఆయన సొంతం అవుతుంది. 


ఇతే.. ఇటీవల చంద్రబాబు ఓ కొత్త రికార్డు సంపాదించారు. దేశంలోనే నెంబర్ 1 సీఎం అయ్యారు. ఎందులోనో తెలుసా.. ఆయనే ఇప్పుడు దేశంలో అందరికన్నీ ధనవంతుడైన  
ముఖ్యమంత్రి.. అవును.. స్థిర, చర ఆస్తులు రెండూ కలిపితే ఆయన చంద్రబాబు సంపద రూ 177 కోట్లు.. ఇదీ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌.. ఏడీఆర్..  అనే సంస్థ వెల్లడించిన వాస్తవం. ఇక చంద్రబాబు తర్వాత స్థానంలో అరుణాచల్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.129కోట్లట. 


మూడో స్థానం పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ దక్కించుకున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.48 కోట్లు . ఇంతకీ మరో తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ స్థానంలో ఉన్నారా అనుకుంటున్నారా.. ఆయనే ఈ జాబితాలో నాలుగో స్థానం సంపాదించారు.  కేసీఆర్‌ ఆస్తులు వివరాల్లోకి వెళ్తే.. రూ.  6,50,82,464 విలువైన చరాస్తులు, రూ. 8.65 కోట్ల విలువైన స్థిరాస్తులు.. మొత్తం 15 కోట్ల వరకూ ఉన్నాయి. 


ఇక అందరికన్నా తక్కువ ఆస్తులు ఉన్న సీఎం ఎవరో తెలుసా.. ఆయన త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌. త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్ ఆస్తులు కేవలం రూ. 26 లక్షలు మాత్రమే. పేద సీఎంల జాబితాలో సెకండ్ ప్లేస్ దీదీగా పిలుచుకునే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దక్కించుకున్నారు. ఈమె ఆస్తులు 30 లక్షలు మాత్రమే.. జమ్మూ కాశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ  55 లక్షల ఆస్తులతో మూడో పేద సీఎంగా ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: