మహాటీవీ.. తెలుగులో ఇదో న్యూస్ ఛానల్ ఉందన్న సంగతి అంతగా తెలియదు.. జనంలోకి అంతగా ఈ ఛానల్ దూసుకపోలేదు. సీనియర్ జర్నలిస్ట్ ఐ. వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ఛానల్ కు మిగిలిన చానళ్లతో పోలిస్తే ఆర్థిక వెసులుబాటు అంతగా లేదు. మొదటి నుంచి సోసో నడుస్తూ వస్తున్న ఈ మహాటీవీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. 


ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిల్లో సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన మూర్తి ఇప్పుడు మహా టీవీలో చేరడంతో ఆ ఛానల్ లో జోష్ కనిపిస్తోంది. దీనికితోడు యాజమాన్యంలోనూ వచ్చిన మార్పులు కొత్త మార్పులకు కారణమయ్యాయి. మొత్తానికి ఇప్పుడు మహాటీవీ లైవ్ లతో దూసుకుపోతోంది. ఏబీఎన్ ఛానల్లో ఉన్నప్పటి నుంచే లైవ్ డిస్కషన్స్ ద్వారా దూకుడుగా ఉండే మూర్తి రాకతో మహాలో మహా మార్పు వచ్చింది.



తాజాగా ఈ ఛానల్ లైవ్ డిష్కసన్స్ కుమ్మేస్తోంది. దీనికి తోడు బీజేపీ, టీడీపీ వివాదం.. కేంద్రానికి బడ్జెట్ లో అన్యాయం అంశాలను మహా ఛానల్ బాగా ప్రజెంట్ చేస్తోంది. ఏపీకి అన్యాయం జరిగిందని ఆంధ్రా ప్రజలు భావిస్తున్న తరురణంలో ఏపీలోని నాయకులను అందర్నీ ఓ చోటే చేర్చి లైవ్ డిష్కసన్స్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా సోమవారం తిరుపతిలో నిర్వహించిన లైవ్ డిష్కషన్ రచ్చరచ్చగా మారింది. 


టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు ప్రజాసంఘాల వారినీ ఈ చర్చకు పిలిచారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వచ్చి తమ పార్టీ వాదన వినిపించారు.  చర్చకు వచ్చినవారు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, పార్టీల వారిగా విమర్శలు చేసుకోవడంతో చర్చ కాస్తా రచ్చగా మారింది. డిష్కషన్ నిర్వహిస్తున్న మూర్తి కొందరికే అవకాశం ఇస్తున్నారని ఓ పార్టీ వారు ఆరోపించడంతో చర్చ మరింత రచ్చగా మారింది. మొత్తానికి మహాటీవీ ఇలాంటి ప్రత్యేక చర్చలతో దూసుకుపోతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: