ఒక పసి మనసులో కలవరం. హృదయాంతరాళాల్లో బడబాగ్ని. బయటకు చెప్పటానికి బాషలేదు ఎలా చెప్పాలో తెలియదు. "మేము అభివృద్ది చెందిన కులం వాళ్ళమట ఇది నాకు మాపాఠశాలలో మాత్రమే తెలిసింది. అదీ పెద్దోళ్ళు చెప్తేనే. మా తాతలు ఎప్పుడో నేతులు తాగారంట. మా మూతుల వాసనలు పసిగట్టిన పెద్దోళ్ళు అది కనుగొన్నా రట. మాకు మాత్రం వాటి వాసనలు కాదు కదా!  నేతుల రూపం కూడా తెలియ పోయినా మాది పేరుకు అగ్రకులం. బడిలో పేరు రాయించేటపుడు తోకలేమీ తగిలించనప్ప టికీ కులం మాత్రం ఎఫ్సి అట మమ్మల్ని ఓసీ గానే చూస్తారట" 

Image result for children hearts are very sensitive

ప్రతి సంవత్సరం పాఠశాల ప్రారంభించే సమయలో ఉచిత పుస్తకాల పంపిణీ లో అందరితో పాటు మాకు ఉండేదికాదు. ఎందుకో మా పసిహృదయాలకు ఆ క్షణం అర్ధం కాకపోయినా మాకు పుస్తకాలు రానందుకు మస్తిష్కాలు రోదించేవి. ఆ బాధతో మొహం మాడ్చుకుని ఇంటికెళ్ళి మాకెందుకు పుస్తకాలివ్వరని మా అమ్మ నడిగేవాళ్ళం. మనకు డబ్బులు ఉన్నాయి కదా! అని ఆమె సమాధానం. మరి మన కంటే ఎక్కువ పొలం, డబ్బులు, కార్లు ఉన్న ఫలానా వాళ్ళకి ఎందుకిస్తున్నారని అడిగితే అవన్నీ మన కెందుకు? మనం డబ్బులు పెట్టి కొనుక్కుందాం! అని నాన్న ఓదార్పు.

Image result for children hearts are very sensitive

"పసిహృదయాలు దేవాలయాలు" ఆ లేత మనసులు ఎన్ని ఓదార్పు మాటలు విన్నా కొన్ని రోజులు ముభావంగా ఉండి పోయే వాళ్ళం. మళ్ళీ పుస్తకాలు కొనిచ్చేదాకా. కొన్ని రోజుల తర్వాత కొంచెం విషయ పరిజ్ఞానం వచ్చాక ఈ రిజర్వేషన్లు కనిపెట్టిన వాళ్ళ మీద కోపం తారస్థాయికి చేరేది. అసలు రిజర్వేషన్లు ఎందుకు పెట్టారో? తెలిశాక, ఒకసారి రిజర్వేషన్ ను ఉపయోగించు కుని జీవితంలో పైకి వచ్చినా తరతరాలుగా సిగ్గులేకుండా ప్రభుత్వసొమ్మును దుర్వినియోగం చేసేవారి మీద ఆగ్రహం కట్తలు త్రెంచుకునేది. 

Related image

ఈ రిజర్వేషన్లు అందవలసిన వారికి సహాయపడకుండా, "అభివృద్ధి చెందిన వెనుకబడ్డ కులాల" వారి అడుగులకు మడుగు లొత్తుతున్నా ఈ రిజర్వేషణ్ చట్టాలను మార్చా లని మాట మాత్రమైనా అనుకోకపోవడం మన నాయకుల "ఓటు బ్యాంకు రాజకీయాలు" మనల్ని ఎంత నిమ్న స్థాయికి జార్చేస్తున్నాయో తెలుసుకున్నా! ఎన్నికల్లో గెలవటమే వారికి ప్రధానం అన్న తీరు అత్యంత జుగుప్సాకరం. ఇప్పుడు గనుక ఈ "రిజర్వేషణ్ ప్రధాత బీఆర్ అంబేద్కర్"  గనక జీవించి ఉన్నా, మళ్ళా పుట్టినా ఈ చట్టం చట్టుబండలౌతున్న తీరు చూసి,  దుర్వినియోగమౌతున్న విధం చూసి ఖచ్చితంగా సిగ్గుపడతాడో...తనెంత ఆత్మహత్యా సదృశమైన పనిచేశాడో నని గుర్తించి తాను......?

Image result for children hearts are very sensitive

35% మార్కులు తెచ్చుకున్న వైద్యుని వైద్యం ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలించండి చాలు. మనకు కర్తవ్యం బోధ పడుతుంది. మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు మన మంత్రులే సభ్యులుగా ఉండి ఆమోదించిన బడ్జెట్ పై, చర్చ జరిగేటప్పుడు, ఆ బడ్జెట్ అన్యాయం చేసిందని బయట ధర్నా చేసే సమయం... హృదయ విధారకం. ఎందుకంటే నీకై నీవు తగలబెట్తుకున్న కొంప ముందు నీవే ఎవర్నో తిడుతూ ఉండటం న్యాయమా?

Image result for br ambedkar images

అలాంటి చోట విఙ్జతతో వ్యవహరించవలసిన 35% మార్కుల కోణం నుండి పార్లమెంట్ కు చేరిన ఒక సభ్యుని  అర్ధనగ్న ప్రదర్శన - పగటివేషాలు చూసి  అక్కడి జనం అర్ధ గాక ఉచిత  వినోదం చూస్తారు తప్ప, ఎలా సహాయం చేయగలరని అనుకుందాం?

Image result for half naked leadership of TDP Siva prasad

అర్ధనగ్న నాయకత్వం మనకేంచేయగలదు? అర్ధనగ్నానికి మద్దతిచ్చే మానసిన రోగులను చట్టసభలకు పంపిన మన ఙ్జానానికి బడి మనమే ఏడవాలి తప్ప, మనకోసం ఎవరూ ఏడవరు? 

దీనిపై ఆ అర్ధనగ్న పార్లమెంటేరియన్ ను ఒక జర్నలిస్ట్ మిత్రుడు టెలిజన్ సముఖంగా ప్రశ్నిస్తే  "నీవూ దళితుడివే-నేను దళితుణ్ణే మనం మనం చూసుకోవలసిన దాన్ని పబ్లిక్ లో పెట్టి ప్రశ్నిస్తావా!? అన్న తీరు గర్హనీయం"  ప్రశ్నించిన తీరు సర్వదా విస్తుపోవాల్సిన విషయం.


ఒక దళితుడు భారత భాగ్యవిధాతైన పార్లమెంటెరియన్ గా పరిణామం చెందిన  తరవాత కూడా ఆయన్ని  "దళితుడు" గా గుర్తించమని ప్రజా సముఖంగా కోరుతున్నాడు. ఇంతకన్నా సిగ్గుపడవలసిన విషయం ఆయనకు ఆయన పార్టీకి ఆ పార్టీ అధి నేతకు ఆ రాష్ట్రానికి అవమానం కాదా!  అయిన అదంతా సిగ్గుపడేవాళ్లకి గాని అర్ధనగ్న ప్రదర్శన చేసే వారికెందుకు అంటు న్నారు విఙ్జులు.


హతవిధీ! ఈ దేశం ఏమై పోతుందీ! ఈ భారత జాతిని ఎవరు సంస్కరిస్తారు!? 


ఓ అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రీ!  మీరే సమాధానం చెప్పండీ ఈ ధౌర్భాగ్యఙ్జానికి!!!!!!!?????.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: