పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ .. సినిమాల పరంగా వీరిద్దరికి ఉన్న జనాదరణ అంతా ఇంతా కాదు. అయితే నిన్న మొన్నటి వరకు బాక్స్ ఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా పోటీ పడిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు రానున్న ఎన్నికల్లో రాజకీయ రణరంగంలో కత్తులు దూసుకోక తప్పదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. 
Image result for pawan & ntr
నిజానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. సరిగ్గా ఆ సమయంలోనే జూనియర్ తెలుగు దేశం పార్టీకి దూరం అయ్యాడు. కారణాలు ఏవైనా ఇలా పవన్ టీడీపీ కి దగ్గరగా, జూనియర్ బయట ఎక్కడో అజ్ఞాతవాసిగా ఈ 4 ఏళ్ళు గడపవలసి వచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నడుమ, రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న స్తబ్దత కారణంగా పవన్ టీడీపీ కి దూరం  కావడం పక్కా అని తేలిపోయింది.
Image result for chandra babu
సరిగ్గా ఇదే సమయంలో వరస విజయాలతో ఇప్పుడు తారక్ క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది. ఎలాగో పవన్ లేకపోతే ఆ రేంజ్ లో టీడీపీకి సినీ గ్లామర్ అద్దే సత్తా  ఒక్క తారక్ కి మాత్రమే ఉంది. ఇన్ని తెలిసి అపర చాణుక్యుడు అయిన  చంద్రబాబు జూనియర్ ని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించకుండా ఉండే ప్రసక్తే లేదు. ఈసారి జూనియర్ వస్తే తెలంగాణ టీడీపీ పగ్గాలు అందించడం గ్యారంటీ అన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో తారక్ కనీసం టీడీపీ తరుపున ప్రచారానికి రావడానికి అయినా ఒప్పుకోవచ్చు. ఎంత కాదు అనుకున్నా ఆ తాతకి మనవడిగా అది అతని బాధ్యత కూడా.. సో ఈ లెక్కలు అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే రానున్న ఎన్నికల్లో మనం ఇద్దరి స్టార్ హీరోల మధ్య పొలిటికల్ వార్ చూడబోతున్నాము అనమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: